Mohammed Siraj Sledging: కొలంబో టెస్టులో మ్యాచ్‌తో పాటు కాసింత కలేష్ (స్లెడ్జింగ్) కూడా ఉంటేనే కదా అసలు కిక్కు.. భారత్ 503 పరుగుల భారీ స్కోరు కొట్టాక, లంక బ్యాటర్ కమిల్ మిషారా క్రీజులో నిలదొక్కుకునేందుకు ట్రై చేస్తున్నాడు. 9వ ఓవర్‌లో సిరాజ్ వేసిన అవుట్‌స్వింగర్ బంతులను మిషారా వరుసగా వదిలి పెడుతూ సైలెంట్‌గా ఉండిపోయాడు. దాంతో మన హైదరాబాదీ స్పీడ్‌స్టర్ సిరాజ్ ఊరుకోకుండా.. ఏంట్రా తమ్ముడు.. బంతులు ఊరికే చూస్తున్నావ్, బ్యాట్‌కి తగిలించవా? అంటూ కెలికి స్లెడ్జింగ్ స్టార్ట్ చేశాడు. మిషారా పైకి నవ్వి కవర్ చేసినా, మైండ్‌లో మాత్రం సిరాజ్ వేసిన మైండ్ గేమ్ గట్టిగా రిజిస్టర్ అయిపోయింది.
ప్రసిద్ కృష్ణ ట్రాప్‌కి బలి.. టెంప్ట్ అయి వికెట్ సమర్పణ:
సిరాజ్ అన్న మాటల దెబ్బకి మిషారా కంట్రోల్ తప్పి పేషన్స్ పూర్తిగా కోల్పోయాడు. ఆ తర్వాతి ఓవర్‌లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌కి రాగానే, హ్యాపీగా వదిలేయాల్సిన పైకి లేచిన బంతిని అనవసరంగా కెలకబోయాడు. అంతే.. ఎడ్జ్ తీసుకొని వికెట్ పడింది. సిరాజ్ వేసిన ట్రాప్ లో లంక బ్యాటర్ పడిపోవడంతో ప్రసిద్ కృష్ణ అకౌంట్‌లో వికెట్ పడింది. వికెట్ ప్రసిద్‌దే అయినా, వెనక ఉండి మైండ్ బ్లాంక్ చేసిన అసలైన మాస్టర్ మైండ్ మాత్రం సిరాజే.
►ALSO READ | జపాన్ లో జరిగే ఆసియా క్రీడలకు రైల్వే ప్లేయర్లు.. హైదరాబాద్ లో పనిచేస్తున్న సిబ్బంది
స్లెడ్జింగ్ ఓకే.. మరి బౌలింగ్ ఫామ్ సంగతేంటి మియా:
మైండ్ గేమ్‌లలో 10/10 మార్కులు కొట్టేస్తున్న సిరాజ్‌కి, తన సొంత బౌలింగ్ ఫిగర్స్ చూసుకుంటేనే టెన్షన్ స్టార్ట్ అవుతోంది. 2025లో టెస్టుల్లో నిప్పులు చెరిగిన సిరాజ్, 2026 శ్రీలంక సిరీస్‌లో ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 3 వికెట్లు మాత్రమే తీసి విపరీతంగా స్ట్రగుల్ అవుతున్నాడు. ఇప్పటికే వైట్ బాల్ (ODI, T20) జట్టులో చోటు కోల్పోయిన సిరాజ్‌కి, టెస్టుల్లో కూడా గుర్నూర్ బ్రార్, ఔకిబ్ నబీ వంటి యంగ్ బౌలర్ల నుంచి బెంచ్ కాంపిటీషన్ పీక్స్‌లో ఉంది. అందుకే కేవలం మాటల మైండ్ గేమ్‌లతో సరిపెట్టకుండా, నెక్స్ట్ స్పెల్స్‌లో వికెట్ల పంట పండించి పాత మియా భాయ్ ని ఫామ్‌లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
— crictalk (@crictalk7) August 25, 2026
Prasidh Krishna strikes first this morning! 🔥
— Sony Sports Network (@SonySportsNetwk) August 25, 2026
Kamil Mishara undone by a sharp short ball that climbed awkwardly.
Watch #SLvIND 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/Bo8j4Zx1yB
