జపాన్ లో జరిగే ఆసియా క్రీడలకు రైల్వే ప్లేయర్లు.. హైదరాబాద్ లో పనిచేస్తున్న సిబ్బంది

జపాన్ లో జరిగే ఆసియా క్రీడలకు రైల్వే ప్లేయర్లు.. హైదరాబాద్ లో పనిచేస్తున్న సిబ్బంది

హైదరాబాద్‌‌ సిటీ, వెలుగు: జపాన్‌‌లోని ఐచి–నగోయాలో సెప్టెంబర్‌‌ 19 నుంచి అక్టోబర్‌‌ 4 వరకు జరగనున్న 20వ ఆసియా క్రీడల్లో భారత జట్టుకు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన నలుగురు కబడ్డీ క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించనున్నారు. 

45 దేశాలకు చెందిన అత్యుత్తమ క్రీడాకారులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో 43 క్రీడాంశాలు ఉన్నాయి. మహిళల జట్టులో లాలాగూడ ఎలక్ట్రిక్‌‌ లోకోషెడ్‌‌ ఆఫీస్‌‌ సూపరింటెండెంట్‌‌ రీతూ నేగి, మెట్టుగూడ సిగ్నల్‌‌ అండ్‌‌ టెలి కమ్యూనికేషన్‌‌ విభాగం సీనియర్‌‌ టెక్నీషియన్‌‌ పింకీ రాయ్‌‌ ఎంపికయ్యారు. పురుషుల జట్టులో సికింద్రాబాద్‌‌ సీనియర్‌‌ డివిజనల్‌‌ కమర్షియల్‌‌ మేనేజర్‌‌ కార్యాలయానికి చెందిన ప్రొబేషనరీ కమర్షియల్‌‌ కమ్‌‌ టికెట్‌‌ క్లర్క్‌‌ లు అయాన్‌‌ లోచబ్‌‌, సుమిత్‌‌ సాంగ్వాన్‌‌ ఉన్నారు.