కొత్తవారం దూకుడు ఆపని బంగారం.. గ్రాము హైదరాబాదులో ఎంతంటే?

కొత్తవారం దూకుడు ఆపని బంగారం.. గ్రాము హైదరాబాదులో ఎంతంటే?

ఈనెల బంగారం రేట్లు ఊహలకు అందని స్థాయిలో పెరిగిపోవటం భారతీయ మధ్యతరగతిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రధానంగా శ్రావణమాసంలో శుభకార్యాలకు, ఫంక్షన్లకు షాపింగ్ చేద్దాం అనుకున్న వాళ్లకు పెరిగిన రేట్లు ఊహించని షాక్ ఇస్తున్నాయి. ఒకపక్క డాలర్ బలహీనపడటం, బాండ్ మార్కెట్లలో ఉన్న ఒడిదొడుకులకు తోడుగా పెరుగుతున్న ఆమెరికా అప్పులపై భయాలు బంగారం ధరలను పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ముందుగా తమ నగరాల్లోని మారిన ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకుని ముందుకు సాగటం మంచిది. 

ఆగస్టు 24న బంగారం రేట్లు పెరిగాయి. ఆగస్టు 23 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.88 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 397గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.15వేల 030గా కొనసాగుతోంది. 

సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 24, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 75వేలకు తగ్గింది. అంటే గ్రాము దాదాపు రూ.275 దగ్గర ఉంది.