కంప్లయింట్ ఇస్తే కాలు కూడా కదపరు.. ఇదీ సైబరాబాద్ మున్సిపల్ ఆఫీసర్ల తీరు !

కంప్లయింట్ ఇస్తే కాలు కూడా కదపరు.. ఇదీ సైబరాబాద్ మున్సిపల్ ఆఫీసర్ల తీరు !
  • మై క్యూర్ యాప్లో బయటపడ్డ బాగోతం
  • స్పాట్కు వెళ్లకుండానే ఫిర్యాదులకు ఫేక్​ పరిష్కారాలు 
  • ఆఫీసులోనే కూర్చొని ‘బ్లాంక్​ ఫొటో’ అప్​లోడ్​ 
  • సాల్వ్ ​చేశామంటూ రిపోర్ట్

చందానగర్, వెలుగు: సైబరాబాద్ ​మున్సిపల్ ​కమిషరేట్ ​పరిధిలో అధికారుల అలసత్వం, ఆమ్యామ్యాల అలవాటు అక్రమ నిర్మాణదారులకు వరంగా మారింది. ఎక్కడ అక్రమ నిర్మాణం జరుగుతోంది? పర్మిషన్​ తీసుకున్నది ఎంతవరకు? కడుతున్నది ఎంతవరకు? అసలు అనుమతులు ఉన్నాయా? లేవా? అన్నది ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిశీలించాల్సి ఉండగా, ఆ పని ఎప్పుడో మర్చిపోయారు. ఎవరైనా సమాచారం ఇస్తే అక్రమ నిర్మాణదారులతో మాట్లాడి సెట్ చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.

పైగా, ఎవరైనా ఫలానా చోట అక్రమ నిర్మాణం జరుగుతోందనో.. లేక సమస్య ఉందనో ఫిర్యాదు చేస్తే కనీసం ఆఫీసు నుంచి కాలు కూడా కదపడం లేదు. ఇటీవల కొందరు మై క్యూర్​యాప్​తోపాటు ప్రజావాణి గ్రీవెన్స్​లో సమస్యలపై ఫిర్యాదు చేస్తే అధికారులు ఫేక్​రిపోర్ట్స్​పెట్టి ఆ కంప్లయింట్స్​ను క్లోజ్​చేశారు. కనీసం ఘటనాస్థలికి వెళ్లకుండానే ‘సాల్వ్​చేశాం’ అని రాసేశారు. దీనికి సాక్ష్యంగా ఏమీ కనిపించని బ్లాంక్​ఫొటోలు అప్​లోడ్​చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సదరు అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
 
మై క్యూర్​ యాప్​లో ఫిర్యాదు చేస్తే..
మూడు కార్పొరేషన్ల పరిధిలో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు, పారిశుద్ధ్యం, ఎంటమాలజీ, ఎలక్ట్రికల్, వెటర్నరీ, పార్కింగ్, ఇంజినీరింగ్, ఫుడ్​సేఫ్టీ, చెరువులు, రెవెన్యూ, ఇతర సమస్యలు ఉంటే మై క్యూర్​యాప్​లో ఫిర్యాదు చేయొచ్చు. సమస్యను వివరిస్తూ ఫొటో, లొకేషన్​అప్లోడ్​ చేస్తే అధికారులు లొకేషన్​కు వెళ్లి పరిశీలించి ఏం చర్యలు తీసుకున్నామో తెలియజేస్తూ యాప్​లోని గ్రీవెన్స్​లో అప్లోడ్​ చేయాలి. 

చేస్తున్నదేమిటి ? 
మై క్యూర్​యాప్లో ఎక్కువగా అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫిర్యాదులే వస్తున్నాయి. అయితే, సంబంధిత టౌన్​ప్లానింగ్​ఆఫీసర్​స్పాట్​కు వెళ్లి అక్రమ నిర్మాణాన్ని పరిశీలించి, ఏ చర్య తీసుకున్నామో తెలియజేస్తూ ఫొటోలు పెట్టకుండా అఫీసులోనే కూర్చొని కథ మొత్తం నడిపిస్తున్నారు. ఏదో ఒక బ్లాంక్​​ఫొటో అప్​లోడ్​చేసి ఫిర్యాదు క్లోజ్​ చేస్తున్నారు. 

ఇవీ ఉదాహరణలు
* గచ్చిబౌలి వినాయక్​నగర్​లోని ప్లాట్​నెంబర్​62లో అక్రమ నిర్మాణం జరుగుతోందని ఓ ఫిర్యాదు వచ్చింది. అయితే, మై క్యూర్​యాప్​లో టౌన్​ప్లానింగ్​ఆఫీసర్​సమస్య పరిష్కరించినట్లు ఒక బ్లాంక్​ఫొటో అప్​లోడ్​చేశారు. సమస్య గచ్చిబౌలిలో ఉంటే ..మాదాపూర్​కావూరి హిల్స్​లో ఫొటో అప్​లోడ్​ చేసినట్లు గూగుల్​కోఆర్డినేషన్​లో తేలింది.

* మియాపూర్​ మదీనగూడ రామకృష్ణనగర్​లోని బాబాయ్​హోటల్​వెనక అక్రమ షెడ్​నిర్మాణం జరుగుతోందని ఫిర్యాదు వచ్చింది. ఇది మియాపూర్​ సర్కిల్​ టౌన్​ ప్లానింగ్​ఆఫీసర్​కు వెళ్లగా స్పాట్​కు వెళ్లకుండానే అటెండ్​అయినట్లు, అక్రమ షెడ్​నిర్మాణానికి నోటీసులిచ్చినట్లు రిపోర్ట్​ ఇచ్చారు. అయితే, ఈ పనంతా మియాపూర్​సర్కిల్​ఆఫీసులో కుర్చొని బ్లాంక్​ఫొటో అప్​లోడ్​చేసినట్టు గూగుల్​కో ఆర్డిరేషన్​లో బయటపడింది.
 
* మియాపూర్​పటేల్​ చెరువు బండ్​బఫర్​జోన్​ఆక్రమించి కృషినగర్​లో రెండు నిర్మాణాలు జరుగుతున్నాయని కంప్లయింట్​రాగా, మియాపూర్​టౌన్​ప్లానింగ్​ఆఫీసర్​ఈ నిర్మాణాలకు నోటీసులు జారీ చేశామని ఫీల్డ్​కు వెళ్లకుండానే సర్కిల్​ఆఫీసులో గూగుల్​మ్యాప్​తో కూడిన బ్లాంక్​ఫొటో అప్​లోడ్​చేశారు. సమస్యను పరిష్కరించినట్లు గ్రీవెన్స్​క్లోజ్​చేశారు. 

ఫీల్డ్ ​విజిట్కు వెళ్తే ఆ ఘటన జరిగేదా?
టౌన్​ ప్లానింగ్​ ఆఫీసర్లు ఫీల్డ్​ విజిట్​కు వెళ్లి నిర్మాణ దశలోనే అక్రమాలను గుర్తిస్తే అంజయ్య నగర్​ లాంటి ఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉండదు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే అవి పేకమేడల్లా కూలి ప్రాణాలు తీస్తున్నాయి. ఐటీ కారిడార్లో అద్దెలు, హాస్టళ్లకు భారీ డిమాండ్​ఉండడంతో చాలామంది బిల్డర్లు, యజమానులు అడ్డదారులు తొక్కుతున్నారు.

తక్కువ స్థలంలో, తక్కువ ఖర్చుతో నాసిరకంగా ఐదు, ఆరు, ఏడు అంతస్థుల వరకు కడుతున్నారు. అవి కూలుతుండడంతో అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తున్నది. ఇప్పటికైనా అధికారులు ఫీల్డ్​విజిట్​చేసి ఇలాంటి కట్టడాలను గుర్తించి అవి ఏ స్థితిలో ఉన్నాయో చూసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.