ఇంకా ఎంతకాలం:49 పిల్లల బడి.. ఒక్క టీచరే .. ఆదిలాబాద్ జిల్లా పల్సి బి ప్రైమరీ స్కూలు పరిస్థితి ఇది

ఇంకా ఎంతకాలం:49 పిల్లల బడి.. ఒక్క టీచరే .. ఆదిలాబాద్ జిల్లా పల్సి బి ప్రైమరీ స్కూలు పరిస్థితి ఇది

మారుమూల గిరిజన గ్రామాల్లోని సర్కార్​ బడుల్లో టీచర్ల కొరతతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. ఆదిలాబాద్​ జిల్లా తలమడుగు మండలం పల్సి ‘బి’ గ్రామంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 49 మంది విద్యార్థులు చదువుతున్నారు.

 వీరందరికీ ఒకే తరగతి గది, ఒక్క టీచర్​ మాత్రమే ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండేళ్ల క్రితం స్కూల్​లో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లలో ఒకరు బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి మరో ఉపాధ్యాయుడిని నియమించకపోవడంతో ఒక్కరే విద్యార్థులకు బోధిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆ ఒక్క టీచర్​ సెలవు పెడితే బడికి సెలవు ఇవ్వాల్సిన పరిస్థితి  నెలకొంది.