ఈ ఏడాది (2026) శ్రావణ మాసానికి చాలా విశిష్టత ఉంది. ఐదుశుక్రవారాలే కాకుండా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. శ్రావణమాసంలో 18 ఏళ్ల తరువాత చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఖగోళ శాస్త్రవేత్తలు... జ్యోతిష్య సిద్దాంతులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 28 న ఈ సంవత్సరంలో రెండవది.. చివరి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంతే కాదు ఆ రోజు రాఖీ పండుగ కూడా వచ్చింది.
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది శ్రావణ పూర్ణిమ రోజున ( ఆగస్టు 28) చంద్రహణం ఏర్పడుతుంది. గతంలో ఇలాంటి గ్రహణం 2008లో సంభవించిందని పండితులు చెబుతున్నారు. చంద్రగ్రహణం సాధారణంగా పౌర్ణమి తిథి రోజున ఏర్పడుతుంది. శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. ఈ ఏడాది రాఈ పండుగ.. చంద్రగ్రహణం ఒకే రోజు వచ్చాయి.
ఈ ఏడాది( 2026) ఆగస్టు 28 శ్రావణ పూర్ణిమ రోజునే చివరిది.. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం పాక్షికంగా ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాని భారతదేశంలో ఈ గ్రహణం అస్సలు కనపడదు. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 28న ఉదయం 06:53 గంటలకు మొదలై మధ్యాహ్నం 12:32 గంటలకు ఈ గ్రహణం ముగుస్తుంది. పగటిపూట ఈ ఖగోళ ఘటన జరగడం, ఆ సమయంలో చంద్రుడు క్షితిజానికి దిగువన ఉండటం వల్ల ఇది మన దేశంలో కనపడదు. అమెరికా, యూరప్, ఆఫ్రికా, తూర్పు పసిఫిక్ ప్రాంతాల ప్రజలు మాత్రమే కనపడుతుంది.
ఖగోళశాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం సూర్యుడికి... చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్యకాంతి నేరుగా చంద్రుడిపై పడకుండా భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. సూర్యుని కాంతిలోని ఎరుపు.. నారింజ రంగుల కాంతికి సంబంధించిన నీడ చంద్రుడని కప్పివేస్తుంది.
పాక్షిక చంద్రగ్రహణం ఆగస్టు 28న ఆకాశంలో ఓ అద్భుతమైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కాబోతుంది. చంద్రుడిలో కొంత భాగం ముదురు ఎరుపు, నారింజ, రాగి రంగులో కనపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడిలో ఎక్కువ భాగం భూమి నీడ ఉండటంతో పాక్షిక చంద్రగ్రహణంగా పరిగణిస్తారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఖగోళ శాస్త్రం ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
