హైదరాబాద్, వెలుగు: పీజీఎల్‌సెట్ ప్రవేశాల్లో భాగంగా ఎల్ఎల్‌ఎం కోర్సులకు ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. కన్వీనర్ కోటా కింద మొత్తం 1,058 సీట్లు అందుబాటులో ఉండగా.. ఫస్ట్ ఫేజ్‌లో 967 మందికి సీట్లను కేటాయించినట్టు ప్రవేశాల కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఎల్ఎల్‌ఎం సీట్ల కోసం మొత్తం 2,637 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోగా.. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా 547 మంది పురుషులు, 420 మంది మహిళలకు సీట్లు అలాట్ చేసినట్టు వివరించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కన్వీనర్ సూచించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 27లోగా తమకు కేటాయించిన కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు.
