ఆపిల్ ఐఫోన్ 18 సిరీస్: సెప్టెంబర్‌లోనే లాంచ్..? సేల్స్, ప్రీ-ఆర్డర్, ఈవెంట్ వివరాలు లీక్ !

ఆపిల్  ఐఫోన్ 18 సిరీస్: సెప్టెంబర్‌లోనే లాంచ్..?  సేల్స్, ప్రీ-ఆర్డర్, ఈవెంట్ వివరాలు లీక్ !

 అమెరికన్ టెక్ కంపెనీ ఆపిల్ నుంచి రాబోతున్న కొత్త సిరీస్   ఐఫోన్ 18 లాంచ్ తేదీలు, ప్రీ-ఆర్డర్లు, సేల్స్ వివరాలకు సంబంధించి  అంచనాలు  ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఆపిల్ దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, ప్రస్తుత లీకులు,  మార్కెట్ అంచనాల ప్రకారం మరో రెండు వారాల్లో ఐఫోన్ 18  సిరీస్ రానున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే  ఆగస్టు 26న లాంచ్ ఈవెంట్ ఇన్విటేషన్స్ పంపే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9న క్యూపెర్టినోలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో  అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ఈ ఈవెంట్ జరగవచ్చు. ఈ ఈవెంట్‌లో ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా ప్రదర్శించే ఛాన్స్ ఉంది.

సాధారణంగా ఈవెంట్ జరిగిన వారంలోనే ప్రీ-ఆర్డర్లు మొదలవుతాయి. అయితే సెప్టెంబర్ 11న శుక్రవారం వచ్చినప్పటికీ, ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 12  శనివారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

 కొత్త ఐఫోన్‌లతో పాటు రాబోతున్న  లేటెస్ట్  iOS 27 సోఫ్ట్‌వేర్ అప్‌డేట్ సెప్టెంబర్ 14న విడుదల కావచ్చు. కానీ కొన్ని కొత్త యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కేవలం కొత్త ఫోన్‌లలో మాత్రమే పనిచేస్తాయి. సెప్టెంబర్ 18 నుండి కొత్త ఐఫోన్ 18 సిరీస్ ఫోన్లు ఆన్‌లైన్, ఆఫ్ లైన్  స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రావచ్చు. ప్రస్తుతానికి ఇవన్నీ అంచనాలు మాత్రమే. అయితే ఆపిల్ సంస్థ నుండి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.