ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి రాజస్థాన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులకు కల్పనకు భారీ ఎత్తున నిధులను కేటాయించింది. అన్ని సర్కార్ బడులను బలోపేతం చేసేందుకు 12వేల 500 కోట్ల నిధులను ప్రకటించింది. పనులను సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఇటీవల కాక్రోచ్ పార్టీ చేపట్టి స్కూల్ ఠీక్ కరో ఉద్యమంతో రాజస్థాన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాజస్థాన్ లోని 41 జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించేందుకు 2026 ఆగస్టు 23న 12వేల 500 కోట్ల రోడ్ మ్యాప్ ను అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోడ్ మ్యాప్ లో రాష్ట్రంలోని పాఠశాలకు కొత్త భవనాలు, అదనపు తరగతి గదులు, మరమ్మత్తులు, టాయిలెట్ కాంప్లెక్స్ నిర్మాణం ఉన్నాయి.
ఈ బ్లూప్రింట్ లో 3వేల 587 కొత్త స్కూల్ భవనాల కోసం రూ. 2వేల 487 కోట్లు, 83వేల కొత్త క్లాస్ రూం లకోసం 8వేల 378 కోట్లు కేటాయించింది రాజస్థాన్ ప్రభుత్వం. 22వేల పాఠశాలల్లో మరమ్మత్తులకోసం 1129 కోట్లు , 13వేల కొత్త టాయిలెట్ల కోసం రూ. 340 కోట్లు కేటాయించింది.
ALSO READ : 22Aపై ప్రతిపక్షాలది తప్పు డు ప్రచారం..
రాజస్తాన్ వ్యాప్తంగా 611 ప్రభుత్వపాఠశాలకు సొంత భవనాలు లేవు. వీటితోపాటు 2వేల పాఠశాలల్లో మరుగు దొడ్లు లేవని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. మరో వెయ్యి స్కూళ్లు తాగునీటి సౌకర్యం లేకుండా నడుస్తున్నాయని తెలిపింది. ఇక కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు ఇటీవల పర్యటించిన జైపూర్ లోని రాంపురా కన్వర్ పురా సర్కార్ స్కూల్ కు నిధులు కేటాయించింది రాజస్తాన్ ప్రభుత్వం. కొత్త భవననిర్మాణానికి 18 లక్షలు కేటాయించింది. సెప్లెంబర్ 1 నుంచి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
