ఆస్పత్రిలో మందు కొడుతున్న మహిళ.. పట్టించుకోని సిబ్బంది.. నెటిజన్లు ఫైర్..

ఆస్పత్రిలో మందు కొడుతున్న మహిళ..  పట్టించుకోని సిబ్బంది.. నెటిజన్లు ఫైర్..

మధ్యప్రదేశ్‌లోని జిల్లా ఆసుపత్రిలో ఓ మహిళా మద్యం సేవిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన జబల్‌పూర్ విక్టోరియా ఆసుపత్రి వార్డులో  జరగ్గా...  ఓ మహిళ నేరుగా బాటిల్ తీసి మద్యం తాగుతుండటం ఈ వైరల్ వీడియోలో  కనిపిస్తుంది....

అయితే ఆ మహిళ కుమారుడు ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. ఆమె పక్కనే ఉన్న మరో వార్డులోకి వెళ్లి మద్యం సేవించినట్లు తెలుస్తోంది.

దింతో ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది, డాక్టర్లు ఉండగానే, లోపలికి మద్యం బాటిల్ ఎలా వచ్చిందనే దానిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఈ విషయం పై  ఆసుపత్రి యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

సాగర్ జిల్లా ఆసుపత్రిలో మరో ఘటన:
జూన్ 24న సాగర్ జిల్లా ఆసుపత్రిలో ఒక రోగి మంచం కింద కూర్చుని మద్యం తాగుతున్న దృశ్యాలను అక్కడే ఉన్న ఒక మహిళ రికార్డ్ చేసింది. కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది అతడిని హెచ్చరించినా వినకుండా మద్యం తాగినట్లు తెలిసింది.

ఇదే వార్డులో గతంలో కూడా ఒక మధ్య వయస్కుడు తాగుతూ కనిపించిన వీడియో వైరల్ కావడంతో ఆసుపత్రి పర్యవేక్షణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.