గ్లోబల్ సమ్మిట్ కోసం వెళుతుంటే.. బీజేపీ పెట్టుబడులు అడ్డుకుంటుంది : సీఎం రేవంత్ రెడ్డి

గ్లోబల్ సమ్మిట్ కోసం వెళుతుంటే.. బీజేపీ పెట్టుబడులు అడ్డుకుంటుంది : సీఎం రేవంత్ రెడ్డి

అమెరికా పర్యటన వెనక కారణాలు ఏంటీ అనేది కేంద్రానికి ముందే తెలుసు అని.. 2026 డిసెంబర్ నెలలో తెలంగాణలో జరిగే గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడులు పెట్టేందుకు.. అమెరికాలోని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించటానికి అమెరికా వెళ్లాలని షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నట్లు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. నేను అమెరికాలోని ఆక్సఫర్డ్ వర్సిటీలో చదువుకున్నానని.. నాకు అక్కడి నుంచే ఆహ్వానం ఉందని.. స్పష్టమైన ఆహ్వానం ఉన్నా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవటం ఏంటని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. 

అమెరికా పర్యటన వ్యక్తిగతమైనది కాదని.. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం.. వర్సిటీల ఏర్పాటు కోసం వెళుతుంటే.. కేంద్రం అడ్డుకోవటం అంటే.. ఇది తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అవమానంగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనను అడ్డుకోవటం అంటే.. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీకి ఎంత కక్ష, వివక్ష ఉందో అర్థం అవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతి ఇచ్చి.. అమెరికా పర్యటనకు వెళ్లకుండా కేంద్రం ఆంక్షలు విధించటం అంటే.. తెలంగాణ రాష్ట్రానికి జరిగిన నష్టం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారికంగా పర్యటన వివరాలు కేంద్రం దగ్గర ఉన్నాయని.. అన్నీ ముందే తెలుసు అని.. పర్యటన మధ్యలో అనుమతులు రద్దు చేయటం అనేది తెలంగాణపై కుట్రగా స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.