తమిళనాడు సీఎం కీలక నిర్ణయం.. చెన్నైలో పరందూర్ ఎయిర్ పోర్టు ప్రాజెక్టు రద్దు

తమిళనాడు సీఎం కీలక నిర్ణయం.. చెన్నైలో పరందూర్ ఎయిర్ పోర్టు ప్రాజెక్టు రద్దు

చెన్నైలో  రెండో ఎయిర్ పోర్టు నిర్మాణంపై తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.వివాదాస్పద  పరాందూర్  గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ప్రాజెక్టును రద్దు చేశారు. స్థానికులు,పర్యావరణ వేత్తల ఆందోళనకు ఎన్నికల ముందుకు ఇచ్చిన వాగ్దానంగా ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు. పారిశ్రామిక అభివృద్దికి ఎయిర్ పోర్టులుకీలకం అయినప్పటికీ పరాందూర్ లో ఎయిర్ పోర్టు ఏర్పాటు ఆమోద యోగ్యం కాదని  విజయ్ అన్నారు. ఈ ప్రాజెక్టును పునపరిశీలించాలని గతంలోఅప్పటి ప్రభుత్వాన్ని కోరినప్పటికీ స్పందించలేదు.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ ప్రాజెక్టును విరమించుకుంటున్నామని విజయ్ చెప్పారు. 

తమిళనాడు అసెంబ్లీలో  హైడ్రామా 

ఈ ప్రకటనతో తమిళనాడు అసెంబ్లీలో దుమారం రేగింది.  పరాందూర్ ఎయిర్ పోర్టు రద్దుపై చర్చకుప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అసెంబ్లీ రూల్స్ 110  ప్రకారం.. మంత్రులు లేదా సీఎం నేరుగా చేసే ప్రకటనలు, వ్యాఖ్యలపై చర్చకు తావు లేదని స్పీకర్ తిరస్కరించారు. దీంతో డీఎంకే ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. 

ఏంటీ పరాందూర్ ఎయిర్ పోర్టు ప్రాజెక్టు.. 

చెన్నై దీర్ఘకాలిక అవసరాలకోసం రెండో ఎయిర్ పోర్టును పరందూర్ సమీపంలో నిర్మించేందుకు అప్పటి  డీఎంకే ప్రభుత్వం 2022లో ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ ప్రజెక్టుకు 27వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసింది. నాలుగు దశల్లో నిర్మాణం చేపట్టాలని ప్రణాళిక సిద్దం చేసింది. అయితే అప్పట్లో స్థానిక నివాసితులు, పర్యావరణవేత్తలు  ఆందోళనలు చేశారు. వారికి మద్దతుగా టీవీకే చీఫ్, ప్రస్తుత సీఎం విజయ్ సపోర్టు చేశారు. అధికారంలోకి వస్తే ఎయిర్ పోర్టు రద్దు చేస్తానని హామి ఇచ్చారు. 

ALSO READ : గుజరాత్ సీఎంకు లేని అభ్యంతరాలు..

ప్రజలు ఎందుకు నిరసన తెలిపారు.. 

2022లో డీఎంకే ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. స్థానిక రైతులు, ప్రజలుల, పర్యావరణ వేత్తలు వెయ్యి రోజులకు పైగా పోరాటం చేశారు. ఈ ప్రాజెక్టుతో తమ ఇళ్లు, ఉపాధి కోల్పోతామని సుదీర్థ పోరాటం చేశారు. తాము చేస్తున్న పోరాటం కేవలం పరిహారం కోసం కాదు.. ఎయిర్ పోర్టు కోసం సేకరించాలనుకున్నర 5వేల 369 ఎకరాల్లోదాదాపు సగం సారవంతమైన, నిటిపారుదల సౌకర్యం ఉన్న వ్యవసాయ భూమి, ఏటా మూడు పంటలు పండుతాయని, ఈ భూములు పోతే మా ఉపాధి పోతుందని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. మరోవైపు ఎయిర్ పోర్టుతో పర్యావరణం దెబ్బతింటుందని పర్యావరణ వేత్తలు కూడా తమ ఆందోళన తెలిపారు. 

అప్పట్లో కొత్తగా టీవీకే పార్టీ స్థాపించిన ప్రస్తుత సీఎం విజయ్.. పరాందూర్ ఎయిర్ పోర్టు బాధితులకు అండగా నిలిచారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎయిర్ పోర్టు ను రద్దు చేస్తామని హామి ఇచ్చారు.  ప్రజలకు ఇచ్చిన  హామీని నెరవేర్చేందుకు పరాందూర్ ఎయిర్ పోర్టు ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు సీఎం విజయ్ తాజాగా ప్రకటించారు.