ప్రపంచ దేశాలకు పాప్ కార్న్ ముసునూరు నుంచే వెళ్లాలని అన్నారు చంద్రబాబు. సోమవారం ( ఆగస్టు 24 ) ఏలూరు జిల్లా ముసునూరులో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ లతో కలిసి నాన్ GMO పాప్ కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. మన ఉత్పత్తలు ప్రపంచానికి ఆదర్శం కావాలని అన్నారు. భవిష్యత్తు అంతా స్టార్టప్ లు, ఆవిష్కరణలదే అని అన్నారు.
తక్కువ కాలంలో విజయం సాధించడం గొప్ప విషయమని.. ఈ ప్లాంట్ 29 టన్నుల సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద పాప్ కార్న్ ప్రాసెసింగ్ కేంద్రంగా నిలుస్తోందని అన్నారు. భవిష్యత్తులో పాప్ కార్న్ అంటే గుర్తొచ్చేది ముసునూరే అని అన్నారు. 11 ఏళ్లలో మొక్కజొన్న ఉత్పత్తి వాటా 65 శాతానికి పెరిగిందని అన్నారు.
అన్ని దేశాలకు ఇక్కడి నుంచే పాప్ కార్న్ పంపించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ కు తీసుకెళ్లడం వల్ల వస్తువు విలువ చాలా రెట్లు పెరుగుతుందని అన్నారు చంద్రబాబు.స్వదేశీ విధానంతో స్వయం సమృద్ధి సాధించాలని అన్నారు.
గోదావరి, కావేరి నదులు అనుసంధానం కావాలని.. దేశంలో నదులు అనుసంధానం కావాలని కోరుకునే వ్యక్తి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అని అన్నారు చంద్రబాబు. గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, కావేరి నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రాల మధ్య సమస్యలు తొలగిపోతాయని అన్నారు చంద్రబాబు.
