కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు సంచలన ప్రకటన చేశారు. జూలై 25 విరమణ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదు..ఇందుకు నిరసనగా ఉపాధ్యాయ దినోత్సవం రోజు సెప్టెంబర్ 5న ఢిల్లీలో మరోసారి నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. ఈ ర్యాలీలో చనిపోయిన నీట్ విద్యార్థుల కుటుంబాలు, నిరసనల్లో పోలీసుల దాడికి గురైన విద్యార్థులు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, దేశం నలుమూలలనుంచి యువత పాల్గొంటారని తెలిపారు.
సోమవారం (ఆగస్టు24) కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ట జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం అయిన సెప్టెంబర్ 5న ఢిల్లీలో నిర్వహించే మహార్యాలీపై చర్చించారు. నిరసనల విమరణ సందర్బంగా బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై సమీక్షించారు. దీక్ష విరమించి నెలరోజులు గడిచినా స్పష్టమైన చర్యలు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు కాక్రోచ్ లు. ప్రభుత్వ తన మాటల నిలబెట్టుకోవడంలో విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలపై దాటవేస్తుంది. సుప్రీంకోర్టు ఎదు కూడా స్పష్టమైన హామీలు ఇవ్వకుండా తప్పించుకుంది అని కాక్రోచ్ లు ఆరోపించారు.
మా సహనం బలహీనత కాదు: సీజేపీ
యువతకు, విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం చేస్తోంది.. ఇది కొనసాగితే మరోసారి పెద్ద ఎత్తున శాంతియుత నిరసనలకు దిగుతామని సీజేపీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యువతకు ద్రోహం చేయాలని ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ఉద్యమించాలని జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించింది సీజేపీ.
సెప్టెంబర్ 5 న తాము నిర్వహించే నిరసన ర్యాలీ ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా కొనసాగుతుందని సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు.అదే విధంగా కేంద్ర ప్రభుత్వం దేశ యువతకు ఇచచిన హామీలను స్పూర్తితో గౌరవించి నెరవేలర్చాలని కోరారు.
