ఐదు నుంచి 17 ఏళ్ల వయసున్న పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ సెప్టెంబర్ 30 వరకు ఉచితంగానే ఉంటుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకటించింది. ఈ గడువు లోగా ఈ ప్రక్రియను ఉచితంగా పూర్తి చేసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులకు సూచించింది. పిల్లలకు ఐదేళ్లు నిండినప్పుడు, మరోసారి 15 ఏళ్ల వయసులో తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ (MBU) చేయించాలని UIDAI తల్లిదండ్రులకు స్పష్టం చేసింది.
అంతేకాకుండా.. ఆధార్ రికార్డులను కచ్చితంగా ఉంచడం, అలాగే స్కూల్ అడ్మిషన్లు, ఎగ్జామ్స్, స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ పథకాలను పొందేందుకు పిల్లలు తమ గుర్తింపును సజావుగా ధృవీకరించుకోవడానికి వీలు కల్పించడమే ఈ అప్‌డేట్ లక్ష్యం. ఐదు సంవత్సరాల లోపు పిల్లల ఆధార్ నమోదులో వివరాలు, ఫోటోను తీసుకుంటారు. వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లను నమోదు చేయరు. ఎందుకంటే ఈ బయోమెట్రిక్స్ ఇంకా అభివృద్ధి దశలో ఉన్నాయి.
►ALSO READ | ఆటో యూనియన్ల సమ్మె విరమణ.. ప్రభుత్వంతో చర్చలు సఫలం
అందువల్ల.. పిల్లలు తమ ఆధార్ రికార్డులు అప్‌డేట్‌గా ఉండేలా చూసుకోవడానికి, ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత వారి బయోమెట్రిక్ సమాచారాన్ని అందించాలని, 15 సంవత్సరాల వయస్సులో మరోసారి ఆధార్ బయోమెట్రిక్ అప్ డేట్ చేయాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. మన దేశంలో ఆధార్ కార్డుకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుర్తింపు ధృవీకరణ కోసం 12 అంకెల ఆధార్ నంబరు జారీ చేస్తారు. ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలను పొందడానికి ఆధార్ ఉపయోగపడుతుంది.
UIDAI has achieved a significant milestone in its nationwide mission-mode drive for Mandatory Biometric Updates (MBU), completing over 20 million (over 2 crore) MBUs for school children across the country.
— Aadhaar (@UIDAI) August 19, 2026
The initiative was enabled by UIDAI’s technological integration with the… pic.twitter.com/hB8l8h2AER
