ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లో అనర్హులు 20 వేల మంది

ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లో అనర్హులు 20 వేల మంది
  •     తొలి విడతలో ఇండ్లు 7,340 
  •     వచ్చిన అప్లికేషన్లు 60,720 
  •     అభ్యంతరాలకు నేటితో ముగియనున్న గడువు

హైదరాబాద్ సిటీ, వెలుగు: క్యూర్ పరిధిలోని16 నియోజకవర్గాల్లో తొలి విడతగా మంజూరు చేయనున్న 7,340 ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. ఇప్పటివరకు 60,720 దరఖాస్తులు రాగా.. అన్నింటినీ వడపోసి, ప్రాథమికంగా 40 వేల మందిని అర్హులుగా గుర్తించారు. అయితే, వీరు ఈ నెల 23లోగా అభ్యంతరాలు సమర్పించుకోవడానికి గుడువు ఇచ్చారు. వాటిని పరిశీలించి 25న ఫైనల్​లిస్ట్​రిలీజ్​చేయనున్నారు. తర్వాత 27 నుంచి 30వ తేదీ వరకు లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. 

అభ్యంతరం చెప్పాలి ఇలా? 

అనర్హులైన వారు https://tghb.telangana.gov.in/curestatus ద్వారా లాగిన్ అయి, అప్లికేషన్ నంబర్, మొబైల్ నంబర్, ఆధార్ ఆప్షన్​ఎంచుకుని పక్కనే ఉన్న బాక్సులో సంబంధిత నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బట న్ క్లిక్ చేయాలి. అక్కడ మీ అప్లికేషన్ నంబర్, పేరు, ప్రాజెక్టు లొకాలిటీ, స్టేటస్, క్లెయిమ్ ఆప్షన్లు కనిపిస్తాయి. అర్హులైన వారికి ఎలిజిబుల్ అని, కానీ వారికి ఇన్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. పక్కనే ఉన్న ఎరుపు రంగు బాక్సులో రెయిజ్​క్లెయిమ్ ఆప్షన్ క్లిక్ చేస్తే..ఎందుకు అనర్హుల్ని చేశారనే వివరాలు కూడా కనిపిస్తాయి.  అయితే అధికారులు అక్కడ ఉంచిన వివరాలు తప్పుగా అనిపిస్తే కింద బాక్సులో ఎందుకు తప్పు వచ్చిందో వివరాలు చెప్పొచ్చు. దీంతో పాటు సరైన ఎవిడెన్స్ ఉన్న డాక్యుమెంట్స్ సమర్పించవచ్చు.  

రెయిజ్​ క్లెయిమ్ ఇలా..

తమ అప్లికేషన్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేసి రెయిజ్​క్లెయిమ్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ దరఖాస్తు తిరస్కరణకు కారణం కనిపిస్తుంది. ఒకవేళ ఆ వివరాలు తప్పు అని భావిస్తే, దానికి తగిన సరైన డాక్యుమెంట్స్ అప్‌‌‌‌లోడ్ చేయాలి. గడువులోగా ఈ పని చేస్తే  పరిశీలించి, లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారు.  

రిజెక్ట్​ చేసింది ఇందుకే..

కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలామంది అప్లికేషన్లు రిజెక్టెడ్​లిస్ట్​లోకి చేరాయి. వారి పేరుతో కరెంటు, నల్లా బిల్లులు, రవాణా వాహనాలు ఉండటం, ట్యాక్స్ పరిధిలోకి రావడం, గతంలో భూమి అమ్మకాలు జరిపినట్లు రికార్డుల్లో ఉండటం వంటి కారణాలతో అనర్హుల జాబితాలో చేర్చారు.