రేపు ( ఆగస్టు 23) మర్చిపోకండి.. కొత్తగా పెళ్లయిన వారు చేయాల్సింది ఇదే..!

రేపు ( ఆగస్టు 23) మర్చిపోకండి.. కొత్తగా పెళ్లయిన వారు చేయాల్సింది ఇదే..!

పెళ్లిలో అలా మూడు ముళ్లు వేసిన వరుడిని .. కట్టించుకున్న వధువుని  వివాహ పెద్దలు శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు అని దీవిస్తుంటారు.  అలాంటి పెద్దల మాట నిజం కావాలంటే కొత్త దంపతులు.. శ్రావణమాసం శుక్లపక్షం ఏకాదశి రోజున కచ్చితంగా పుత్రదా ఏకాదశి వ్రతం చేయాలని పండితులు  చెబుతున్నారు.  ఈ ఏడాది అలాంటి పవిత్రమైన రోజు ఆగస్టు 23 ఆదివారం వచ్చింది.  ఇక పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఎలా చేయాలి.. ఏఏ నియమాలు పాటించాలి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.  .! 

హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఏకాదశికి విశిష్టత.. ప్రాధాన్యత ఉంటుంది. శ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన కొత్తగా పెళ్లైన దంపతులకు చాలా ముఖ్యమని పండితులు చెబుతున్నారు.  దంపతులు ఈ వ్రతాన్ని భక్తితో, నియమనిష్టలతో పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని  పురాణాల ద్వారా తెలుస్తుంది.   పుత్రద ఏకాదశి వ్రతం ఆచరిస్తే  లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో  గుణవంతులైన సంతానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 

కొత్తగా పెళ్లయిన వారు ... సంతానం లేనివారు, సంతానం కలగాలని కోరుకునే వారు, తమ బిడ్డలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే వారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఈ ఏడాది ఆగస్టు 23న పుత్రదా ఏకాదశి వ్రతం పాటించనున్నారు. తమ పిల్లలు దీర్ఘాయుష్షు పొందాలని, సంతానం పొందాలని ఆకాంక్షిస్తూ ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు.

సంతాన ఏకాదశి పూజా విధానం

  • సూర్యోదయానికి ముందే వేకువజామునే  భార్య భర్తలు ఇద్దరు నిద్ర లేవాలి.
  • కాలకృత్యాల అనంతరం..  స్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
  • విష్ణువు విగ్రహాన్ని  లేదా చిత్ర పటాన్ని పూజా మందిరంలో పీట మీద ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రం పరిచి దాని మీద పెట్టాలి. 
  • ఆవునెయ్యితో దీపం వెలిగించి, పూలు, స్వీట్లు దేవుడికి సమర్పించాలి. 
  • తులసి పత్రంతో పాటు పంచామృతాన్ని విష్ణుమూర్తికి సమర్పించాలి. ఈ పూజలో తప్పనిసరిగా తులసి పత్రం ఉండాలి. లేదంటే పూజ అసంపూర్ణంగా భావిస్తారు. 
  • సూర్యాస్తమయానికి ముందే పూజ చేసి విష్ణువుకి భోగం సమర్పించాలి. 
  • విష్ణు సహస్రనామ పారాయణం, హరి స్తోత్రం పఠించాలి. 
  • విష్ణుమూర్తి దీవెనల కోసం తప్పకుండా ఆలయానికి వెళ్ళి పూజలు చేయాలి. 
  • ఉపవాసం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా పుత్రద ఏకాదశి కథ విన్నా తర్వాత ఉపవాసం విరమించుకోవాలి.
  • దంపతులు దగ్గరిగానే ఉండి బ్రహ్మచర్యం పాటిస్తూ.. స్వామిని ధ్యానిస్తూ రోజంతా గడపాలి.

పుత్రద ఏకాదశి కథ

హిందూ పురాణాల ప్రకారం పూర్వం భద్రావతి రాజ్యాన్ని సుకేతుమన్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి శైవం భార్య. తమకి పిల్లలు లేరని చనిపోయిన తర్వాత శ్రార్థ ఖర్మలు చేసేందుకు కూడా కొడుకు లేడని ఆలోచిస్తూ కుంగిపోయారు. ఈ మనోవేదనతో రాజు రాజ్యం వదిలి అడివి బాట పట్టాడు. అడవిలో ఉన్న రుషులు కొందరు రాజు బాధకి గల కారణం అడిగి తెలుసుకున్నారు. సంతానం లేదని చెప్పడంతో రుషులు పుత్రద ఏకాదశి వ్రతం ఆచరించమని సూచిస్తారు. వారి సూచనల మేరకు సుకేతు రాజు తన భార్యతో కలిసి పుత్రద ఏకాదశి వ్రతం ఆచరించాడు. ఫలితంగా వారికి విష్ణుమూర్తి ఆశీస్సులతో పుత్రుడు జన్మిస్తాడు. 


Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.