రా అండ్ రస్టిక్ 'అనకాపల్లి'కి అదిరిపోయే రెస్పాన్స్.. దసరా విన్నర్ అవుతుందంటున్న టీమ్!

రా అండ్ రస్టిక్ 'అనకాపల్లి'కి  అదిరిపోయే రెస్పాన్స్.. దసరా విన్నర్ అవుతుందంటున్న టీమ్!

భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబోలో రూపొందిన పక్కా రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా 'అనకాపల్లి'. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించగా, త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించారు. గాజువాక, విశాఖపట్నం, అనకాపల్లి రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ పీరియాడిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు. 

 గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం దాదాపు 200 థియేటర్లలో విశేష ఆదరణతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‌లో చిత్రబృందం గ్రాండ్ 'థాంక్యూ మీట్' నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. నా కుమారుడు విక్రమ్ నటనకు వస్తున్న ప్రశంసలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. గతంలో నా 'ఎవడిగోలవాడిదే' చిత్రానికి కూడా మొదట్లో నెగెటివ్ టాక్ వచ్చినా ఆ తర్వాత సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. నూకాలమ్మ తల్లి ఆశీస్సులతో 'అనకాపల్లి' కూడా ఈ దసరాకు భారీ విజయాన్ని అందుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.

సోమ, మంగళవారాల్లో కూడా చాలా చోట్ల హౌస్‌ఫుల్స్ పడటం 'అనకాపల్లి' పవర్ ఏంటో నిరూపిస్తోంది అని దర్శకుడు త్రినాథరావు నక్కిన అన్నారు.. కాండ్రేగుల నాయుడు, ఇంద్రజ మాట్లాడుతూ.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నప్పటికీ, చిన్న సినిమాలకు తగినన్ని థియేటర్లు కేటాయించకపోవడం బాధాకరం. డిస్ట్రిబ్యూటర్లు స్పందించి మా చిత్రానికి మరిన్ని స్క్రీన్స్ ఇవ్వాలి అని కోరారు. అనకాపల్లి' అసలు సిసలు విజయాన్ని సాధించినందుకే ఈ రోజు ఈ థాంక్యూ మీట్‌కి వచ్చానని ఇంద్రజ అన్నారు. తాను నటించిన సినిమా నిజంగా విజయం సాధిస్తేనే తాను ఆ సక్సెస్ మీట్ కు హాజరవుతానని తెలిపారు.  మూవీ సక్సెస్ కాకుండా.. సక్సెస్ మీట్ నిర్వహిస్తే మాత్రం తాను వెళ్లనని తేల్చిచెప్పారు.

దేవ్‌జండ్ అందించిన ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విక్రమ్ సహిదేవ్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, ఇంద్రజ సెంటిమెంట్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. పక్కా లోకల్ ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్‌తో .. ఆ నూకాలమ్మ తల్లి జాతర మ్యాజిక్‌ను థియేటర్లలోనే ఎక్స్‌పీరియన్స్ చేయాలని మూవీ టీమ్ పిలుపునిచ్చింది.