దేశ వ్యాప్తంగా ఇండ్ల అమ్మకాలు ఆరు శాతం డౌన్.. హైదరాబాద్లో హాట్ కేకులా అమ్మకాలు

దేశ వ్యాప్తంగా ఇండ్ల అమ్మకాలు ఆరు శాతం డౌన్.. హైదరాబాద్లో హాట్ కేకులా అమ్మకాలు
  •  జూన్​ క్వార్టర్లో 91 వేల యూనిట్ల అమ్మకం

 
న్యూఢిల్లీ:దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య ఇండ్ల అమ్మకాలు ఆరు శాతం తగ్గి 91,729 యూనిట్లకు పడిపోయాయి. గత ఏడాది ఇదే క్వార్టర్​లో 97,674 యూనిట్లు అమ్ముడుపోయాయి.  ప్రాప్‌‌‌‌‌‌‌‌టైగర్ రియల్ ఇన్‌‌‌‌‌‌‌‌సైట్ రిపోర్ట్​ప్రకారం.. మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా కొనుగోలుదారులు వెనక్కితగ్గడంతో విక్రయాలు మందగించాయి. 

ముంబై, ఢిల్లీ– ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్, బెంగళూరు, పుణే, కోల్‌‌‌‌‌‌‌‌కతా, అహ్మదాబాద్​లో అమ్మకాలు పడిపోయాయి.  చెన్నైలో  మాత్రం 36 శాతం వృద్ధితో 7,183 యూనిట్లు అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 15 శాతం వృద్ధి కనిపించింది. జూన్​క్వార్టర్లో 13,196 యూనిట్లు సేల్​ అయ్యాయి. 

పశ్చిమ ఆసియా ఘర్షణలు, ఉద్యోగ రంగాలపై ఏఐ ప్రభావం వంటి అంశాలు సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ను ప్రభావితం చేశాయి. కొత్త ఇండ్ల సరఫరా ఆరు శాతం పెరిగి 89,161 యూనిట్లకు చేరుకుంది. చదరపు అడుగు ధర రూ.10 వేలపైనే ఉందని రిపోర్ట్​ పేర్కొంది.