ప్రముఖ బంగారు ఆభరణాల రిటైలర్ జాయ్ ఆలుకాస్ వ్యవస్థాపకుడు జోయ్ ఆలుకాస్ తన లగ్జరీ జీవితాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. సరికొత్త ప్రైవేట్ జెట్‌ను తన కలెక్షన్‌లో చేర్చుకున్నారు. అత్యంత విలాసవంతమైన ‘సెస్నా సిటేషన్ ఎక్స్‌ఎల్‌ఎస్+’ మోడల్ ప్రైవేట్ విమానాన్ని ఆయన కొనుగోలు చేశారు. దీని విలువ సుమారు రూ.125 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
భారతదేశంలోనే అతిపెద్ద జ్యువెల్లరీ సామ్రాజ్యాలలో ఒకదానిని నిర్మించిన జోయ్ ఆలుకాస్, ఇప్పుడు ఈ భారీ కొనుగోలుతో మరోసారి వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు. గోల్డ్ వ్యాపారంతోకి అడుగుపెట్టి.. నేడు వందల కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌కు యజమానిగా మారడం ఆయన విజయానికి నిదర్శనమని నెటిజన్లు కొనియాడుతున్నారు.
►ALSO READ | హోమ్ లోన్స్ ట్రాప్‌లో పడకండి: జెన్‌జీకి ముంబై మహిళ రియాలిటీ అడ్వైజ్..!
ఈ లగ్జరీ విమానం కొనుగోలు సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణ ప్రజలు బంగారం కొనుగోలు చేయడానికే ఎన్నోసార్లు ఆలోచించే ఈ రోజుల్లో.. ఏకంగా బంగారం వ్యాపారి ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయడంపై సోషల్ మీడియా వినియోగదారులు సరదాగా జోకులు పేలుస్తున్నారు. "అసలైన గోల్డ్ అప్‌గ్రేడ్ అంటే ఇదే" అంటూ రకరకాల మీమ్స్‌తో సోషల్ మీడియాలో దీనిని ట్రెండ్ చేస్తున్నారు.
వ్యాపార రంగంలో విజయాలను సాధిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జోయ్ ఆలుకాస్.. ఈ సరికొత్త విలాసవంతమైన ప్రైవేట్ జెట్ సొంతం చేసుకోవడం ద్వారా ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. కష్టపడితే ఏ రంగంలోనైనా ఏ స్థాయికైనా ఎదగవచ్చనడానికి ఆయన ప్రయాణం ఒక ఉదాహరణగా మారింది.
