రూ.75 లక్షలు ఇస్తున్న పాత కంపెనీలోనే ఉండాలా.. రూ.92 లక్షల ఆఫర్‌కి మారాలా: డైలమాలో టెక్కీ

రూ.75 లక్షలు ఇస్తున్న పాత కంపెనీలోనే ఉండాలా.. రూ.92 లక్షల ఆఫర్‌కి మారాలా: డైలమాలో టెక్కీ

ఓవైపు కంఫర్టబుల్ జాబ్, మరోవైపు కళ్లు చెదిరే భారీ శాలరీ ప్యాకేజీ ఆఫర్. ప్రస్తుతం బెంగళూరు కార్పొరేట్ సర్కిల్స్‌లో ఒక టెక్కీ కెరీర్ డైలమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సరిగ్గా 40 ఏళ్ల వయసులో.. 15 ఏళ్లుగా ఒకే కంపెనీలో పనిచేస్తూ స్థిరపడిన ఐటీ మేనేజర్ ముందొక పెద్ద సవాలు నిలబడింది. ప్రస్తుత ఆఫీసులో ఎలాంటి టెన్షన్ లేకుండా ఏటా రూ.75 లక్షల శాలరీ అందుకుంటూ.. ఇంటికి దగ్గరగా ఉంటూ హాయిగా గడుపుతున్నాడు. కానీ మరో గ్లోబల్ టెక్ దిగ్గజం నుంచి ఏకంగా రూ.92 లక్షల ప్యాకేజీతో లైన్ మేనేజర్ ఆఫర్ వచ్చేసరికి అతని మనసులో ఆలోచనలు మొదలయ్యాయి.

15 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆ సంస్థలో అతను సంపాదించుకున్న నమ్మకం, కార్పొరేట్ బంధాలు అన్నీ ఒకెత్తు అయితే.. కొత్త ఆఫర్‌తో వచ్చే అదనపు ఆదాయం, కెరీర్ ఎదుగుదల మరోకెత్తు. ఒకే కంపెనీకి పరిమితమైపోయానేమో అనే ఆలోచన నుంచి బయటపడి, సరికొత్త సవాళ్లను స్వీకరించడానికి ఈ ఆఫర్ సరైన అవకాశమనిపిస్తోందని సీనియర్ టెక్కీ ఆలోచిస్తున్నారు. కానీ దశాన్నర కాలంగా అలవాటుపడిన ఆ సౌకర్యవంతమైన వాతావరణాన్ని వదిలేసి.. సున్నా నుంచి కొత్త ప్రయాణం మొదలుపెట్టాలనే ఆలోచనే అతన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. నిద్రలేని రాత్రులతో అతను పడుతున్న ఈ మథనం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.

ఈ క్లిష్టమైన సందిగ్ధతపై రెడిట్‌లో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటికైనా సాహసం చేసి ముందడుగు వేయాలని కొందరు సలహా ఇస్తున్నారు. వయసు 40లలో పడినప్పుడు ఇలాంటి సాహసాలే భవిష్యత్తులో మనల్ని మార్కెట్‌లో రేస్‌లో నిలబెడతాయని.. సరికొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో అనుభవాలు వస్తాయని ఉత్సాహపరుస్తున్నారు. లీడర్‌షిప్ హైరింగ్ సర్కిల్స్ సేఫ్ అంటూ మరికొందరు ధైర్యం చెబుతున్నారు.

ALSO READ : సామాన్యులకు హడల్ పుట్టిస్తున్న గోల్డ్ ర్యాలీ.. 

అయితే 15 ఏళ్ల సేఫ్ జాబ్ కెరీర్‌ను పణంగా పెట్టి ఆ కొత్త ఆఫర్‌ను స్వీకరించడం నిజంగా తెలివైన పనేనా? లేక తెలిసిన కంపెనీలోనే కంఫర్ట్‌గా కొనసాగడమే మంచిదా? అంటే అతను తీసుకునే నిర్ణయం భవిష్యత్తును పూర్తిగా మార్చేయడం ఖాయం అంటున్నారు నెటిజన్లు.