ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్న వేళ బులియన్ మార్కెట్లు ఈ ఏడాది ప్రారంభంలో మాదిరిగా ఊహించని స్థాయిలకు చేరుకుని దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ప్యూర్ గోల్డ్ రేట్లు మళ్లీ గ్రాము రూ.17వేలు దిశగా దూసుకెళుతున్నాయి. మరోపక్క వెండి కూడా 3 రోజుల్లోనే రూ.20వేలు పెరిగి ఆందోళన పుట్టిస్తోంది సామాన్య మధ్యతరగతి ప్రజలకు. అసలే శుభకార్యాల సమయం కావటంతో రేట్లు కూడా పెరగిన వేళ షాపింగ్ చేయాలనుకునే తెలుగు ప్రజలు తమ నగరాల్లోని కొత్త రేట్లను తెలుసుకోవటం బెటర్.
ఆగస్టు 22న బంగారం రేట్లు భారీగా పెరిగాయి. ఆగస్టు 21 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.152 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 309గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 950గా కొనసాగుతోంది.
శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 22, 2026న దేశవ్యాప్తంగా రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.5వేలు పెరిగి రూ.2లక్షల 70వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.270 దగ్గర అమ్మకాలు జరుగుతున్నాయి.
