మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ తొలి రోజే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. బుక్‌మైషోలో గంటకు 32.25 వేల టికెట్లు అమ్ముడై, చిరంజీవి మన శంకర వరప్రసాద్ పేరిట ఉన్న 31.6 వేల టికెట్ల రికార్డును అధిగమించింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ సహా ప్రధాన నగరాల్లో ఈవెనింగ్, నైట్ షోలు దాదాపు హౌస్‌ఫుల్‌గా మారాయి.
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఆధ్యాత్మిక ఎమోషనల్ యాక్షన్ డ్రామాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా రూ.24.20 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తండ్రీ–కూతుళ్ల సెంటిమెంట్, అయ్యప్ప స్వామి నేపథ్యం, రవితేజ నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో వీకెండ్‌లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
HEART WINNING BLOCKBUSTER #Irumudi is on a rampage at the box office ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) August 21, 2026
All night shows across the Telugu States are sold out for tonight 💥💥
Running successfully in theatres near you 🤩
Book Your Tickets Now!
🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI / #IRUMUDIKATTU pic.twitter.com/QssCOmSZGa
‘ఇరుముడి’ బ్రేక్ ఈవెన్ టార్గెట్..
ప్రపంచవ్యాప్తంగా ‘ఇరుముడి’ దాదాపు రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సుమారు రూ.21 కోట్ల నెట్, రూ.45 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. ఇప్పుడు శని, ఆదివారాల్లో కూడా ఇదే డిమాండ్ (పాజిటివ్ టాక్, టికెట్ల బుకింగ్స్) కొనసాగితే వీకెండ్ లెక్కతోనే వందకోట్ల క్లబ్ ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు రవితేజ సినిమాల్లో ధమాకా మాత్రమే వందకోట్ల మార్క్ అందుకుంది.
