‘విరూపాక్ష’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు సోదరుడు వివేక్ దండు హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్’. సి.హెచ్.రవి కిశోర్ దర్శకుడు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. వివేకానంద్ వర్మ నిర్మిస్తున్నారు. శనివారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంనుంచి ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇందులో హీరో వివేక్ దండు మెగా కామ్రేడ్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పనసపల్లి రాజు పాత్రలో కనిపించనున్నట్టు రివీల్ చేశారు. తను ఫ్రెండ్స్‌తో కలిసి థియేటర్స్ దగ్గర చేసే సందడి నేపథ్యంగా ఈ మెగా సాంగ్‌ను రూపొందించారు. ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్, ఆడెవడన్నా ఈడెవడన్నా మెగాస్టార్‌కు అడ్డెవడన్నా, ఒకటి రెండు మూడు, మా బాస్ ముందు ఎవడు.. ’ వంటి మెగా ఫ్యాన్స్ చెప్పే స్లోగన్స్‌నే లిరిక్స్‌గా రాశారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా మాస్ బీట్‌తో కంపోజ్ చేశాడు.
