Jobs: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు: పదో తరగతి, డిప్లొమా ఉంటే చాలు.. అప్లై చేసుకోండి!

 Jobs: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు: పదో తరగతి, డిప్లొమా ఉంటే చాలు.. అప్లై చేసుకోండి!

కొచ్చిన్​ షిప్​యార్డ్ లిమిటెడ్ (సీపీఎల్) షిప్ డ్రాఫ్ట్స్​మెన్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 60. 

విభాగాల వారీగా ఖాళీలు: షిప్ డ్రాఫ్ట్స్​మెన్ ట్రైనీ (మెకానికల్) 47, షిప్ డ్రాఫ్ట్స్​మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్) 13.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతితోపాటు సంబంధిత విభాగంలో కనీసం 60శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా  పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 25ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 04. 

ALSO READ : విశాఖ SBCలో గవర్నమెంట్ జాబ్స్

సెలెక్షన్ ప్రాసెస్: ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.cochinshipyard.inను సందర్శించండి.