విశాఖ SBCలో గవర్నమెంట్ జాబ్స్: పదో తరగతి పాసైన వారికి సూపర్ ఛాన్స్.. నెలకు మంచి జీతం!

విశాఖ SBCలో గవర్నమెంట్ జాబ్స్: పదో తరగతి పాసైన వారికి సూపర్ ఛాన్స్.. నెలకు మంచి జీతం!

షిప్ బిల్డింగ్ ​సెంటర్ (ఎస్​బీసీ), విశాఖపట్టణం ఫైర్ ఇంజిన్ డ్రైవర్, కన్​స్ట్రక్షన్ హ్యాండ్లర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 09.

విభాగాల వారీగా ఖాళీలు: కన్​స్ట్రక్షన్ హ్యాండ్లర్– ఏ (ఫిట్టర్) 3, కన్​స్ట్రక్షన్ హ్యాండ్లర్ (ఎలక్ట్రీషియన్) 3, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) 3, సివిలియన్ మోటార్ ట్రాన్స్​పోర్ట్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) 1. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. డ్రైవర్ ఉద్యోగాలకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్​తోపాటు కనీసం మూడేళ్లు కారు డ్రైవింగ్​లో అనుభవం ఉండాలి.  

వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్  వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 22. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 14.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: అక్టోబర్. 

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), స్కిల్ టెస్ట్/ శారీరక దారుఢ్య పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ sbcrecruitment.inను సందర్శించండి. 

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్​
ఆన్​లైన్ టెస్టులో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్​నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ట్రేడ్ సిలబస్, జనరల్ ఇంగ్లిష్  నుంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం100 ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 120 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.