అన్నదమ్ములు.. అక్క చెల్లెళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాఖీ పండుగ టైం దగ్గరపడుతోంది. ఇప్పటికే వీధుల్లో అందమైన రాఖీలు వెలిశాయి. ఈ ఏడాది రాఖీ పూర్ణిమ.. అంటే శ్రావణ పౌర్ణమి విషయంలో కొంత గందరగోళం నెలకొంది.రాఖీ పండుగను ఆగస్టు 27న జరుపుకోవాలా.. లేక 28న జరుపుకోవాలా అనే విషయంపై పండితులు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు ఆ విషయాన్ని సమగ్రంగా తెలుసుకుందాం. . .!
అన్నాచెల్లెల్ల ప్రేమకు వారి మధ్య ఉండే ప్రేమకు, అప్యాయతలకు ప్రతీక రక్షాబంధన్. అయితే ప్రతి సంవత్సరం రాఖీ పండుగను శ్రావణ పౌర్ణమి తిథి రోజు జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం పౌర్ణమి ఘడియలు ఆగస్టు 27, 28 రెండు తేదీల్లో ఉండటంతో ఎప్పుడు రాఖీ పండుగ జరుపుకోవాలి అన్న విషయంలో చాలా మందికి స్పష్టత లేదు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం రాఖీ పండుగను ఈ నె 28న జరుపుకోవాలని చెబుతున్నారు.
శ్రావణ పౌర్ణమి ఎప్పుడు..
- శ్రావణ శుక్ల పక్ష పూర్ణిమ తిథి ప్రారంభం: ఆగస్టు 27 ఉదయం 9:08 గంటలకు
- శ్రావణ శుక్ల పక్ష పూర్ణిమ తిథి ముగింపు: ఆగస్టు 28 ఉదయం 9:48 గంటలకు
రక్షాబంధనం (రాఖీ) పండుగ తేది
- ఉదయం తిథి ప్రామాణికంగా శ్రావణ పూర్ణిమ.. రాఖీపండుగ ఆగస్టు 28
రాఖీ కట్టే శుభ ముహూర్తం
- ఆగస్టు 28 : ఉదయం 6:23 గంటల నుంచి ఉదయం 9:48 గంటల వరకు
- ఆగస్టు 28 అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 12:14 గంటల నుంచి 1:05 గంటల వరకు
ఈ పవిత్ర రోజున నదీ స్నానాలు, దానధర్మాలు, ప్రత్యేక పూజలకు విశేషమైన ఫలితం దక్కుతుందని నమ్ముతారు. అంతేకాకుండా ఈ ఏడాది రాఖీ పండుగకు ఎలాంటి భద్రతో పాటు అశుభ సమయాల అడ్డంకులు కూడా లేవు. భద్ర కాలం సూర్యోదయానికి ముందే ముగిసిపోవడంతో రోజంతా సోదరీమణులు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టేందుకు అనుకూలమైన సమయమని వేద పండితులు చెబుతున్నారు.
