మెగాస్టార్ చిరంజీవి (ఆగష్టు 22) బర్త్ డే ట్రీట్ వచ్చేసింది. మెగా అభిమానులకు డైరెక్టర్ బాబీ అదిరిపోయే మాస్ ట్రీట్ ఇచ్చాడు. ‘మెగా158’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న మూవీకి ‘కాకా’ (KAAKA) అనే టైటిల్ కన్ఫామ్ చేస్తూ టీజర్ రిలీజ్ చేశారు.
టీజర్‌లో “Introducing Address: సూపర్ వైజర్ సత్యం, C/O అమ్మాజీ ఆక్వా ఇండస్ట్రీస్, రావులపాలెం” అంటూ చిరంజీవి పాత్రను పరిచయం చేశారు. రావులపాలెంకు చెందిన సాధారణ సూపర్‌వైజర్ సత్యం.. గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడనే ఆసక్తికర కథను టీజర్ హింట్ ఇచ్చింది.
టీజర్ చివర్లో చిరంజీవి వింటేజ్ మాస్ లుక్, పవర్‌ఫుల్ ప్రెజెన్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి.. టీజర్ని బట్టి చూస్తే, సూర్యం అనే ఒక సామాన్యుడు, చివరికి ముంబయి లేదా కోల్‌కతా మాఫియా సామ్రాజ్యానికి గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడనేది కథగా తెలుస్తోంది. చిరు ఎలివేషన్స్, ఎస్. థమన్ బిజియమ్ టీజర్కి స్పెషల్ ఇంపాక్ట్ తీసుకొచ్చాయి.
Introducing
— Bobby (@dirbobby) August 22, 2026
ADDRESS:
Supervisor Satyam,
C/O Ammaji Aqua Industries,
Ravulapalem.
MADNESS:https://t.co/9aluRWXxea
Welcome to the world of #KAAKA 🔥🔥 Wishing our dearest Annayya @KChiruTweets garu a very Happy Birthday. ❤️ 💐#HBDMegaStarChiranjeevi
Produced by… pic.twitter.com/EwF4th7Exm
‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో 2023 సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిరు.. ఈసారి కూడా 2027 సంక్రాంతికి మళ్ళీ అదే రిపీట్ చేయబోతున్నాడు. కాకా’తో జనవరి 13, 2027న సంక్రాంతికి హిస్టరీ రిపీట్ చేయబోతున్నాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, 40 రోజులకు పైగా చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. ఫస్ట్ హాఫ్ కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచేలా తెరకెక్కిస్తున్నారని టాక్.
