మీకు తెలుసా : తిరుమల కొండపై కాలీఫ్లవర్ వంటలు నిషేధం అని..!

మీకు తెలుసా : తిరుమల కొండపై కాలీఫ్లవర్ వంటలు నిషేధం అని..!
  • హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ లలో గోబి (కాలీఫ్లవర్) నిషేధం 

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల స్వామి వారి దర్శనానికి వచ్చే ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యశాఖాధికారులు  స్థానిక హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ దుకాణ దారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  తిరుమల శ్రీవారి భక్తుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత టిటిడి అధికారులు, హోటళ్లు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వారిపై ఉందని డిప్యూటీ ఈవో సోమన్నారాయణ అన్నారు. ఆహారం తాగునీరు పరిశుభ్రంగా ఉండాలని..ఆ దిశగా ఎప్పటికప్పుడు హోటల్ నిర్వాహకులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని  కోరారు. 

 ఈ మధ్యకాలంలో పలు దుకాణాల్లో కాలీఫ్లవర్ (గోబీ) లలో పురుగులు రావడం గుర్తించామని  దానితో తయారుచేసే పదార్దాలను పూర్తిగా నిషేధించాలని  టీటీడీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. మరో రెండు నెలలపాటు ఈ నిషేధం ఉంటుందని తరువాత .. మరోసారి పరిశీలిస్తామని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 15 నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఎలాంటి ఫిర్యాదులు రాకుండా హోటల్ నిర్వాహకులు , స్థానికులు , టీటీడీకి సహకరించాలని కోరారు.