విశాఖలో గ్యాంగ్ వార్.. లవర్ కోసం నడిరోడ్డుపై పొట్టు పొట్టు కొట్టుకున్న స్టూడెంట్స్..

విశాఖలో గ్యాంగ్ వార్.. లవర్ కోసం నడిరోడ్డుపై పొట్టు పొట్టు కొట్టుకున్న స్టూడెంట్స్..

విశాఖలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. నట్టనడి రోడ్డుపై  రోడ్డుపై రెండు వర్గాలుగా విడిపోయి పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు స్టూడెంట్స్. వెంటపడి, వెంబడించి కర్రలు , రాడ్లతో వీఢి రౌఢీల్లా ప్రవర్తించడంతో భయాందోళనకరమైన వాతావరణం ఏర్పడింది. దారినపోయే వాళ్లను కూడా కొట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. 

యువకుల మధ్య కొట్లాటకు ప్రేమ వ్యవహారమే కారణం అని చెబుతున్నారు స్థానికులు. తిమ్మాపురం రోడ్డులోని శివశక్తి నగర్‌లో రెండు రోజుల క్రితం (ఆగస్టు 20) రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  చంద్రంపాలెం పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి కొట్లాటకు దారితీసింది.  దీంతో వారు రెండు వర్గాలుగా ఏర్పడి కర్రలతో ఒక వర్గంపై మరొక వర్గం దాడి చేసుకుంది. 

ఈ ఘటనలో ఆరుగురు యువకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. యువకులలో చాలామంది మద్యం సేవించినట్లు సమాచారం. గురువారం రాత్రి (ఆగస్టు 20), వారిలో కొందరు మళ్లీ ఘర్షణకు ప్రయత్నించగా, పోలీసులు రావడంతో పరారయ్యారు.  ఈ ఘర్షణలో మొత్తం 20 మంది యువకులలో 17 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

అదుపులోకి తీసుకున్నారు  వారిపై ఆరు కేసులు నమోదు చేశారు. వీరిలో ముగ్గురు మేజర్లు , ముగ్గురు మైనర్లు ఉండటం గమనార్హం. ఇరువర్గాల ఘర్షణ జరుగుతున్నప్పుడు అటుగా వెళుతున్న బైక్ రైడర్ తో గొడవకు పడ్డారు విద్యార్థులు. ఆ సమయంలో యువకులకు బండి టైరు తగలడంతో వారితో ఘర్షణ దిగి  వారిని చితకబాదారు.