రేపు ( ఆగస్టు 22 ) కేరళకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. భుజానికి ఆయుర్వేద థెరపీ కోసం..

రేపు ( ఆగస్టు 22 ) కేరళకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. భుజానికి ఆయుర్వేద థెరపీ కోసం..

డిప్యూటీ సీఎం పవన్ కేరళ పర్యటనకు వెళ్లనున్నారు. వైద్యుల సూచన మేరకు భుజానికి ఆయుర్వేద థెరపీ కోసం శనివారం ( ఆగస్టు 21 ) కేరళ వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఇటీవల ముంబైలో కుడి భుజం రొటేటర్ కఫ్ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్..తదుపరి చికిత్సలో భాగంగా ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు. 

శస్త్ర చికిత్స అనంతరం వైద్యులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. కొంతకాలం బహిరంగ కార్యక్రమాలు , విధులకి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. పాలనా బాధ్యతల దృష్ట్యా వారం రోజుల్లోనే పవన్ కళ్యాణ్ క్యాంపు ఆఫీసులో అందుబాటులోకి వచ్చారు. 

ముందస్తుగా ఖరారైన ప్రభుత్వ కార్యక్రమాలు, వరుసగా శాఖాపరమైన సమీక్షలు, పార్టీ అంతర్గత సమావేశాల్లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో శస్త్ర చికిత్స చేసిన భుజం భాగంలో వాపు పెరగడంతోపాటు తీవ్రమైన జ్వరం కూడా వచ్చింది. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు భుజం పూర్తిస్థాయిలో కోలుకునేందుకు కేరళంలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు పవన్ కళ్యాణ్.