యాక్సిస్ ఎనర్జీకి రెండు కోల్ బ్లాక్స్.. రూ.30 వేల కోట్ల పెట్టుబడి

యాక్సిస్ ఎనర్జీకి రెండు కోల్ బ్లాక్స్.. రూ.30 వేల కోట్ల పెట్టుబడి

హైదరాబాద్​, వెలుగు: ఒడిశాలో రెండు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను దక్కించుకున్నామని యాక్సిస్ ఎనర్జీ  ప్రకటించింది. సుందర్‌‌గఢ్, జర్సుగూడ జిల్లాల్లో ఉన్న తంగర్దిహి ఈస్ట్, బేలా పహాడ్​ డిప్ ఎక్స్‌‌టెన్షన్ బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం ద్వారా ఈ సంస్థకు కేటాయించింది. నేషనల్​ కోల్​ గ్యాసిఫికేషన్ మిషన్‌‌లో భాగంగా యూసీజీ కోసం కేటాయించిన మొదటి బ్లాకులు ఇవే కావడం విశేషం.

సాధారణ పద్ధతుల్లో వెలికితీయడానికి వీలులేకుండా, బాగా లోతులో ఉండే బొగ్గును యూసీజీ విధానంలో గ్యాస్‌‌గా మారుస్తారు. ఈ రెండు బ్లాకుల ద్వారా కోట్ల టన్నుల బొగ్గును ఇంధనంగా మార్చవచ్చు.

ఈ ప్రాజెక్టులకు రూ.30 వేల కోట్లకు పైగా పెట్టుబడి అవసరమని యాక్సిస్​తెలిపింది. రిలయన్స్ కూడా ఏపీలో ఇలాంటి ప్రాజెక్టుల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది.