లుమినో ఐపీఓ ధర రూ.82

లుమినో ఐపీఓ ధర రూ.82

కోల్‌‌కతా: ఎలక్ట్రిసిటీ కండక్టర్లు, కేబుల్స్ వంటివి తయారు చేసే  కోల్‌‌కతాకు చెందిన 'లుమినో ఇండస్ట్రీస్ లిమిటెడ్' తమ ఇనీషియల్‌‌ పబ్లిక్ ఆఫర్‌‌‌‌ (ఐపీఓ) ప్రైస్ బ్యాండ్‌‌ను  ప్రకటించింది. రూ. ఐదు ఫేస్‌‌ వాల్యూ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 78 నుంచి రూ. 82గా నిర్ణయించింది. ఇష్యూ మొత్తం సైజ్‌‌ రూ. 700 కోట్లు. 

ఇందులో రూ. 500 కోట్ల ఫ్రెష్‌‌ షేర్ల ఇష్యూ,  రూ. 200 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి.  కంపెనీ ఐపీఓ ఆగస్టు 27న ప్రారంభమై ఆగస్టు 31న ముగియనుంది. షేర్లు బీఎస్‌‌ఈ, ఎన్‌‌ఎస్‌‌ఈలలో లిస్ట్ కానున్నాయి