ఆగస్టు 24 నుంచి పీజీ సీట్ల భర్తీకి సీపీగెట్ కౌన్సెలింగ్

ఆగస్టు 24 నుంచి పీజీ సీట్ల భర్తీకి సీపీగెట్ కౌన్సెలింగ్
  • ఈనెల 31 వరకు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ రిజిస్ట్రేషన్లకు గడువు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్ సహా ఇతర పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సీపీగెట్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 24 నుంచి ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 8 నుంచి 16 వరకు 40 సబ్జెక్టుల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 45,462 మంది హాజరుకాగా.. 42,526 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన వారు ఈనెల 24 నుంచి 31 వరకు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఏవైనా తప్పులుంటే సరిచేసుకోవడానికి సెప్టెంబర్ 5న ఈ–మెయిల్ సపోర్ట్ ద్వారా అవకాశం కల్పిస్తారు. అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్లు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు గడువు ఇచ్చారు. ఇచ్చిన ఆప్షన్లలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే సెప్టెంబర్ 11న ఎడిటింగ్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న అభ్యర్థులకు వారి మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సెప్టెంబర్ 14న తొలి విడత ప్రొవిజనల్ సీట్ల కేటాయింపును ప్రకటిస్తారు. సీటు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 18లోపు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాగా, సెప్టెంబర్ 19 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి.