ఇంటి గ్రేటెడ్ స్కూల్ పనులు స్పీడప్ చేయాలి..వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం

ఇంటి గ్రేటెడ్ స్కూల్ పనులు స్పీడప్ చేయాలి..వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం
  •     మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

ఆర్మూర్, వెలుగు: వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూల్​ పనులు పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆదేశించారు. నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ మండలం అంకాపూర్​లో నిర్మాణంలో ఉన్న డబుల్  బెడ్రూం ఇండ్లు, యంగ్  ఇండియా ఇంటిగ్రేటెడ్  స్కూల్​  పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులను నాణ్యతగా, వేగంగా చేపట్టాలని సూచించారు. 

అర్హులైన వారికి నిర్మాణంలో ఉన్న డబుల్  బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని, ఆలూర్​ తహసీల్ధార్​ ఆఫీస్​ నిర్మాణానికి, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. మంత్రిని ఏఎంసీ చైర్మన్  సాయిబాబా గౌడ్, కౌన్సిలర్  నర్మే నవీన్  మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఆర్మూర్ లో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని,  సొంత స్థలాల్లో బేస్ మెంట్​ నిర్మించుకున్న వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తింపజేయాలని కోరారు. సబ్​ కలెక్టర్​ అభిగ్యాన్​ మాల్వియా, సర్పంచ్​ దేవేందర్, తహసీల్దార్  సత్యనారాయణ పాల్గొన్నారు.