సింగరేణి స్పోర్ట్స్బడ్జెట్ రూ.1.35 కోట్లు.. గేమ్స్ క్యాలెండర్ రిలీజ్ చేసిన మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌

సింగరేణి స్పోర్ట్స్బడ్జెట్ రూ.1.35 కోట్లు..    గేమ్స్ క్యాలెండర్ రిలీజ్ చేసిన మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌
  •     సెప్టెంబర్ మూడో వారం నుంచి నవంబర్ చివరి దాకా పోటీలు 

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి కంపెనీ స్పోర్ట్స్​క్యాలెండర్(2026–27) ​రిలీజైంది. సెప్టెంబర్​మూడో వారం నుంచి నవంబర్​నెలాఖరు వరకు యాన్యువల్​గేమ్స్​అండ్ స్పోర్ట్స్​నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్పోర్ట్స్ నిర్వహణకు రూ.1.35 కోట్ల బడ్జెట్‌‌‌‌‌‌‌‌కు ఆమోదం తెలిపింది. కాగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి స్పోర్ట్స్​బడ్జెట్​ గతేడాది కన్నా ఈసారి రూ.10లక్షలు అదనంగా కేటాయించింది. 

ఈ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను గేమ్స్‌‌‌‌‌‌‌‌కు అవసరమైన మెటీరియల్, క్రీడాకారులకు యూనిఫాం, షూస్​, మెడల్స్, బహుమతులు ఇతర అవసరాలకు వినియోగించాలి. దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఏటా కోలిండియా స్థాయిలో పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కోలిండియా స్థాయి బాడీ బిల్డింగ్, వెయిట్​లిప్టింగ్, పవర్​లిప్టింగ్​పోటీలకు సింగరేణిలోని రామగుండం-1 ఏరియా ఆతిథ్యమివ్వనుంది. 

గేమ్స్​షెడ్యూల్ ఇలా..

సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో సెప్టెంబర్​29,30 తేదీల్లో రామగుండం-3 ఏరియాలో బాల్ బాడ్మింటన్, కబడ్డీ పోటీలు, అక్టోబర్​6,7 తేదీల్లో రామగుండం-2 ఏరియాలో హాకీ పోటీలు, 8,9 తేదీల్లో బెల్లంపల్లి ఏరియాలో మెన్​, విమెన్‌‌‌‌‌‌‌‌కు బాడీ బిడ్డింగ్, వెయిట్​లిప్టింగ్, పవర్​లిఫ్టింగ్​పోటీలు, 13,14 తేదీల్లో శ్రీరాంపూర్​ఏరియాలో బాడ్మింటన్​, టేబుల్​టెన్నిస్​ పోటీలు, 15,16 తేదీల్లో భూపాలపల్లి ఏరియాలో ల్యాన్​టెన్నిస్​, బాస్కెట్​బాల్, అక్టోబర్​ 27, 28 తేదీల్లో కొత్తగూడెం కార్పొరేట్​ఏరియాలో వాలీబాల్, 29,30 తేదీల్లో కొత్తగూడెం ఏరియాలో క్యారమ్స్, చెస్, నవంబర్​4, 5 తేదీల్లో రామగుండం-1 ఏరియాలో ఫుట్​బాల్, 11,12,13 తేదీల్లో మందమర్రి ఏరియాలో క్రికెట్‌‌‌‌‌‌‌‌,17,18 తేదీల్లో ఎల్లందు ఏరియాలో అథ్లెటిక్స్, స్విమ్మింగ్, త్రో బాల్‌‌‌‌‌‌‌‌(విమెన్​), మణుగూరు ఏరియాలో నవంబర్​ 19,20 తేదీల్లో సాంస్కృతిక పోటీలను నిర్వహించనున్నట్లు సింగరేణి యాజమాన్యం పేర్కొంది.