Duleep Trophy Schedule: ఈ ఏడాది జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మక రెడ్ బాల్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ 2026కి సంబంధించిన వేదికల వివరాలు, ఆరు జోన్ల పూర్తి స్క్వాడ్స్‌ను బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. సాంప్రదాయక జోనల్ ఫార్మాట్‌లో జరగనున్న ఈ సమరంలో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్లు ట్రోఫీ కోసం పోటా పడనున్నాయి. అభిమానులకు అదిరిపోయే క్రికెట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైన ఈ మెగా టోర్నీకి సంబంధించి జట్లు, ప్రత్యక్ష ప్రసార వివరాలని ఇప్పుడు తెలుసుకుంద్దాం..
బెంగళూరులో క్వార్టర్స్, సెమీస్.. చెన్నైలో గ్రాండ్ ఫైనల్:
ఈసారి దులీప్ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) గ్రౌండ్ 1, 2లలో జరగనున్నాయి. క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్ మ్యాచ్‌లన్నీ బెంగళూరులోనే నిర్వహిస్తారు. కానీ, ఫైనల్ మ్యాచ్ వేదికలో బీసీసీఐ ఊహించని విధంగా మార్పులు చేసింది. క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువ సంఖ్యలో స్టేడియానికి వచ్చి టైటిల్ పోరును తిలకించేందుకు వీలుగా గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌ను చెన్నైలోని ప్రసిద్ధ ఎంఏ చిదంబరం (చేపాక్) స్టేడియానికి తరలించింది.
దులీప్ ట్రోఫీ 2026 - ఆరు జోన్ల పూర్తి జట్లు ఇవే!
నార్త్ జోన్:
కన్హయ్య వాధవాన్ (కెప్టెన్/కీపర్), ఆయుష్ బదోనీ (వైస్ కెప్టెన్), సనత్ సాంగ్వాన్, యశ్ ధుల్, ఆయుష్ దోసేజా, నిషాంత్ సింధు, అన్షుల్ కంబోజ్, నిఖిల్ కశ్యప్, ఖమ్రాన్ ఇక్బాల్, అబ్దుల్ సమద్, అబిద్ ముష్తాక్, సునీల్ కుమార్, యుధ్‌వీర్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, అర్జున్ శర్మ.
సెంట్రల్ జోన్:
రజత్ పటీదార్ (కెప్టెన్), రింకూ సింగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ పాండే, సారాంశ్ జైన్, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్, కునాల్ సింగ్ రాథోడ్ (కీపర్), ఆర్యన్ జుయల్ (కీపర్), జీషాన్ అన్సారీ, కునాల్ చందేలా, అమన్ మోఖాడే, యశ్ రాథోడ్, హర్ష్ దూబే, యశ్ ఠాకూర్, నాచికేత్ భూటే.
సౌత్ జోన్:
తిలక్ వర్మ (కెప్టెన్), రికీ భుయ్ (వైస్ కెప్టెన్/కీపర్), ఎస్‌కే రషీద్, కే సాయి తేజ, టీ విజయ్, అభినవ్ తేజ్‌రానా, కే హిమతేజ, టీ త్యాగరాజన్, ఆర్ స్మరన్, కరుణ్ నాయర్, శ్రేయస్ గోపాల్, వి కావేరప్ప, ఎండి నిధీష్, ఎన్ జగదీశన్ (కీపర్), అమన్ ఖాన్.
ఈస్ట్ జోన్:
ఇషాన్ కిషన్ (కెప్టెన్/కీపర్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), కుమార్ కుశాగ్ర (కీపర్), దెనిష్ దాస్, అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ కుమార్ ఘరామీ, షాబాజ్ అహ్మద్, సూరజ్ సింధు జైస్వాల్, మహమ్మద్ షమీ, ముకేష్ కుమార్, శిఖర్ మోహన్, అనుకూల్ రాయ్, విరాట్ సింగ్, శుభ్రాంశు సేనాపతి, అభిజిత్ సర్కార్.
వెస్ట్ జోన్:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), షామ్స్ ములానీ (వైస్ కెప్టెన్), హార్విక్ దేశాయ్ (కీపర్), అతీత్ షేత్, శివాలిక్ శర్మ, జైమీత్ పటేల్, ఉర్విల్ పటేల్ (కీపర్), సిద్ధార్థ్ దేశాయ్, పృథ్వీ షా, ముకేష్ చౌదరి, శార్దూల్ ఠాకూర్, ముషీర్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, తనుష్ కోటియాన్, జై గోహిల్.
నార్త్ ఈస్ట్ జోన్:
జోనాథన్ రోంగ్సేన్ (కెప్టెన్), బిశ్వోర్జిత్ సింగ్ కోంథౌజమ్ (వైస్ కెప్టెన్), ఆశిష్ థాపా (కీపర్), టెచి నేరి, ప్రియోజిత్ కే, రోనాల్డ్ మైతేయ్, జోటిన్ సింగ్ ఫైరోయిజమ్, కిషన్ లింగ్డో, అర్పిత సుభాస్ (కీపర్), ఆకాష్ కుమార్ చౌదరి, జోసెఫ్ లాల్తన్ఖుమా, లాల్‌రెమ్‌పౌయా, ఇమ్లివాతి లెమ్తుర్, వినో జి జిమోమి, రాబిన్ లింబో.
లైవ్ టెలికాస్ట్ అండ్ డిజిటల్ స్ట్రీమింగ్:
భారత డొమెస్టిక్ క్రికెట్‌లో దులీప్ ట్రోఫీకి ఘనమైన చరిత్రను కలిగి ఉంది. ఈ టోర్నీని అభిమానుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రత్యక్ష ప్రసారాన్ని విస్తరిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్‌లను టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ (Star Sports) ఛానెల్‌లో చూడవచ్చు. అలాగే ఓటీటీ యూజర్లు జియో హాట్‌స్టార్ (Jio Hotstar) యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు.. టోర్నీలోని ఒక క్వార్టర్ ఫైనల్, ఒక సెమీ ఫైనల్ మ్యాచ్‌తో పాటు గ్రాండ్ ఫైనల్‌ను బీసీసీఐ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
The ultimate zonal showdown is here! 🏏⚡
— BCCI Domestic (@BCCIdomestic) August 20, 2026
6️⃣ Teams. 5️⃣ Matches. 1️⃣ Champion. 🏆
Explore the full #DuleepTrophy fixture breakdown and lock in your dates starting 23rd August 🗓️ pic.twitter.com/h8fEMohIk1
