- 200 చార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు
- మరో 9 స్టేషన్లలో కూడా..
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఎయిర్ పోర్ట్ తరహాలో రూ.714.73 కోట్లతో రూపుదిద్దుకుంటున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ఈ డిసెంబర్ నుంచి అందుబాటులోకి రానుండగా, వరల్డ్క్లాస్ఫెసిలిటీస్ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌స్టేషన్ నుంచి రోజూ 1.5 లక్షల మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండగా, 180 వరకు రైళ్లు వచ్చిపోతున్నాయి.
స్టేషన్ఆధునీకీకరణ పూర్తయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడం, ఎలక్ట్రానిక్వాహనాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో పార్కింగ్లాట్లలో భారీగా చార్జింగ్పాయింట్స్ఏర్పాటు చేస్తున్నారు. బోయిగూడ వైపు బేస్మెంట్ పార్కింగ్ఏర్పాటు చేసిన అధికారులు.. గణేశ్టెంపుల్వైపు మల్టీ లెవెల్పార్కింగ్లాట్నిర్మిస్తున్నారు. ఇక్కడే 200 వందల ఈవీ చార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నారు.
ఇందులో బోయిగూడ లైపు 120 ఛార్జింగ్పాయింట్స్ఉండగా, ఫోర్ వీలర్స్‌కు 100 , టూ వీలర్స్ కోసం 20 ఉన్నాయి. అలాగే గణేశ్‌టెంపుల్ వద్ద నిర్మిస్తున్న మల్టీలెవెల్ పార్కింగ్ లో 80 పాయింట్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 60 పాయింట్స్ ఫోర్ వీలర్స్ కోసం, మరో 20 టూ వీలర్స్ కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే, హైటెక్‌సిటీ, నెక్లెస్‌రోడ్, ఫిరోజ్‌గూడ, సుచిత్ర సర్కిల్, నేరేడ్మెట్, హఫీజ్‌పేట, బేగంపేట, ఉమ్దానగర్, సీతాఫల్మండి రైల్వే స్టేషన్లలో కూడా ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
