వనపర్తిలో రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లుపై విజిలెన్స్‌‌‌‌‌‌‌‌ దాడులు .. రూ.10.10 కోట్ల విలువైన వడ్లు మాయం

వనపర్తిలో రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లుపై విజిలెన్స్‌‌‌‌‌‌‌‌ దాడులు .. రూ.10.10 కోట్ల విలువైన వడ్లు మాయం

వనపర్తి/ఖిల్లాగణపురం, వెలుగు: వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలోని రైసు మిల్లులపై విజిలెన్స్​ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సీఎంఆర్​ కోసం భాగ్యలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ రైస్ మిల్లుకు అప్పగించిన రూ.10.10 కోట్ల వడ్లు మాయమైనట్లు గుర్తించారు. 

ఈ మిల్లుకు కేటాయించిన వడ్లలో 2022-–23లో 2,545 మెట్రిక్​టన్నులు, 2023–24లో 1,321మెట్రిక్​ టన్నులు, 2024–25లో 6,515 టన్నులు మాయమైనట్లు గుర్తించారు. వీటి విలువ రూ.10.10కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇంకా లెక్కలు చూస్తున్నామని తుది నివేదిక పూర్తి కాలేదన్నారు. 

దాడుల్లో విజిలెన్స్​ అండ్​ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సీఐ గణేశ్, జీఎస్టీ,​రెవెన్యూ, సివిల్​ సప్లయి ఆఫీసర్లు పాల్గొన్నారు. ఖిల్లాగణపురం మండల కేంద్రంలోని అన్‌‌‌‌‌‌‌‌పాడులోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర రైసు మిల్లుపైనా ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు.