రిలాక్స్ అవ్వడానికి చాలామంది స్పాకి వెళ్తుంటారు. వీకెండ్స్ లో వెళ్తూ బాడీ, మైండ్ ను రిలాక్స్ చేసుకుంటారు. బయట స్పాలు తెరిచి ఉన్నా, అక్కడికి వెళ్ళాలంటే మగాళ్ల జేబులు.. ఆడోళ్ల పర్సులు ఖాళీ అవుతున్నాయి. అంతేకాదు అప్పుల పాలవుతున్నారు కూడా..అందుకే రిలాక్స్ అవ్వాలని ఉన్నా.. స్పా సెంటర్స్ కు వెళ్లాలంటే భయపడుతున్నారు. కానీ, స్పాకి వెళ్లాలనిపిస్తుంది.అలాంటి వాళ్లు పెద్దగా శ్రమ, ఖర్చు లేకుండానే.. తమ ఇంటి బాత్రూమ్ స్పాగా మార్చుకోవచ్చు.
ఇంట్లోనే స్పా..అరోమా థెరపీ ఆయిల్స్
బయట స్పాలోకి అడుగుపెట్టగానే, ఒకరకమైన సువాసన మనసును తేలికపరుస్తుంది. అందువల్ల ఇంటి బాత్రూమ్ లో డిప్యూజర్ ను పెట్టుకోవాలి. అలాగే లావెండర్, హెంప్ సీడ్, రోజ్, యూకలిప్టస్, స్ట్రాబెర్రీ వంటి అరోమా థెరపీ ఆయిల్స్ తెచ్చుకోవాలి. కావాల్సినప్పుడల్లా నాలుగైదు చుక్కలు ఈ ఆరోమాథెరపీ ఆయిల్ ను డిప్యూజర్ లో వేయాలి. వీ టివల్ల వచ్చే సువాసన అలసిన శరీరానికి, మనసుకు రిలాక్సేషన్ అందిస్తుంది.
బాత్ టబ్: స్పా ఎక్స్ పీరియెన్స్ కావాలంటే బాత్రూమ్ లో బాత్ టబ్‌ను తెచ్చిపెట్టుకోవాలి. అలాగే టబ్ వాటర్ లో నచ్చిన పూల రేకులను వేసుకోవచ్చు. చల్ల నీళ్లకు బదులు గోరువెచ్చని నీళ్లు పోసుకుని, ఆ టబ్ లో కాసేపు రిలాక్స్ అవ్వచ్చు.
ఇండోర్ ప్లాంట్స్:బాత్రూమ్ రెగ్యులర్ గా కాకుండా కాస్తంత స్పెషల్ గా కనిపించాలంటే.. రెండు, మూడు చిన్నసైజు టేబుల్ ప్లాంట్స్ పెట్టుకోవాలి. ఈమధ్య ఇంటీరియ ర్ డెకరేషన్ లో ఇండోర్ ప్లాంట్స్ పై చాలామందిఆసక్తి చూపుతున్నారు. అలా బాత్రూమ్ లో కూడా సువాసన వెదజల్లే, లేదా అందంగా కనిపించే మొక్కల కుండీలు పెట్టుకుంటే స్పా ఎక్స్ పీరియెన్స్ కలుగుతుంది.
బాత్ బామ్స్?:స్పా ఫీలింగ్ తో పాటు బాడీ, స్కిన్ కి మంచి రిలాక్సేషన్ కావాలంటే బాత్ బాంబ్స్ బెస్ట్ అప్షన్. వీటిని నీళ్లలో వేయగానే కరిగిపోతాయి. అప్పుడు దాంట్లోంచి సిట్రిక్ యాసిడ్ రిలీజై చర్మంపై ఉన్న మృ తకణాలను తొలగిస్తుంది. అలాగే అందులోని హై బ్రేటింగ్ ఆయిల్స్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి. నీళ్లు కలర్ లా మారడంవల్ల చాలామంది దాన్ని ఎంజాయ్ చేస్తారు.
క్యాండిల్స్:బాత్రూమ్ కు స్పా బుక్ తెచ్చేందుకు ఈ క్యాండిల్స్ బాగా ఉపయోగపడతాయి. బాత్రూమ్ లో రెగ్యు లర్ వాడే బల్బ్ కి బదులు చిన్నిచిన్న క్యాండిల్స్ పెడితే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. పైగా రెగ్యు లర్ వాడే ఎల్ ఈడీ, ఇన్ క్యాండిసెంట్ బల్బులు కళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి క్యాండిల్స్ ఆ విధంగానూ మంచి చేస్తాయి.
