Beauty tips: డైలీ లైఫ్ ఛేంజ్.. మొటిమలు అస్సలు రావు.. తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!

Beauty tips:  డైలీ లైఫ్ ఛేంజ్.. మొటిమలు అస్సలు రావు.. తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!

టీనేజర్స్ నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతిఒక్కరికి వచ్చే మొదటి చర్మ సమస్య మొటిమలే! ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, పొల్యూషన్, హార్మోన్ల లోపం వల్ల మొటిమలు వస్తాయి.  ఎంత అందమైన ముఖమైనా మొటిమలు మంచిగా అనిపించదు. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. మన డైలీ లైఫ్ లో కొన్ని మార్పులు చేసుకుంటే మొటిమలకు చెక్ పెట్టొచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . !

  • రోజూ కనీసం నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి పోషణ, ఆక్సిజన్ అందుతుంది. దీంతో మొటిమలు రాకుండా ఉంటాయి.
  • ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల మొటిమలు రాకుండా చేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ చర్మంలోకి త్వరగా ఇంకిపోతుంది. ఇది చర్మంలో పోర్స్ క్లోజ్ అవ్వకుండా కంట్రోల్ చేయడం వల్ల గాలి ఆడి మొటిమలు రావు.
  • నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ లివర్ లోని వ్యర్థాలను తొలగించేందుకు ఉపయోగపడు తుంది. లివర్ రక్తంలోని టాక్సిక్ ఎంజైమ్స్ పోర్స్ నుంచి బయటకు వెళ్లడం వల్ల.. చర్మం ఎప్పుడూ తాజాగా ఉంటుంది.
  • మొటిమలు తగ్గిన తర్వాత మచ్చలు ముఖం మీద ఉండిపోతాయి. వీటిని పోగొట్టేందుకు. పుచ్చకాయ జ్యూస్ బాగా ఉపయోగప డుతుంది. పుచ్చకాయలో విటమిన్ ఎ, బి.సి చర్మాన్ని ఎప్పుడూ ఫ్రెష్​ గా  ఉండేలా చేస్తాయి.
  • బ్యాలెన్స్  డైట్ తీసుకోవడం వల్ల మొటిమలను ఈజీగా తగ్గించుకోవచ్చు. తక్కువ ఫ్యాట్ ఉన్నడైరీ ప్రాడక్ట్స్ లో ఉండే విటమిన్-ఎ.. చర్మాన్ని హెల్దీగా ఉంచేందుకు సాయపడుతుంది.
  • యోగర్ట్​ లో  యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ క్వాలిటీస్ చర్మానికి క్లెన్సింగ్ ఉపయోగపడతాయి. అంతేకాకుండా మూసుకుపోయిన పోర్స్​ను అన్ బ్లాక్ చేస్తాయి.
  • రోజుకు కొన్ని వాల్​నట్స్ తినడం వల్ల మన చర్మం మృదువుగా తయారవుతుంది. వాటిలో ఉండే ఆయిల్స్, లినోలిక్ యాసిడ్ స్కిన్ స్ట్రక్చర్ మెయింటైన్ చేసేందుకు, ఎప్పుడూ హైడ్రేట్​ గా ఉండేందుకు ఉపయోగపడతాయి.
  • రోజుకో యాపిల్ తినడం వల్ల కూడా మొటిమలు రావని ఎక్స్​ ప ర్ట్స్ అంటున్నారు. యాపిల్ లో ఉండే పెక్టిన్ మొటిమలను నివారిస్తుందని చెప్తున్నారు.