ఎన్నికల చీఫ్ కమిషనర్ జ్ణానేశ్ కుమార్ నిరంకుశ వైఖరి.. ఫాం 6పై ఆయన చేసిన కుట్రలపై నిరసనలకు దిగింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో పార్లమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ వరకు చేపట్టిన ర్యాలీలో.. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు ఇండియా కూటమి నేతలు అందరూ పాల్గొన్నారు.
ఈసీ ఆఫీస్ ముట్టడికి వెళుతున్న రాహుల్, ప్రియాంక గాంధీలతోపాటు మిగతా నేతలు, కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. సైన్యం తరహాలో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు.. నడి రోడ్డుపైనే అడ్డుకున్నారు. బారికేడ్లు అడ్డంపెట్టి.. ముందుకు వెళ్లకుండా నిర్బంధించారు. ఈ క్రమంలోనే అందరూ రోడ్డుపై బైఠాయించారు.
ఈసీ ఆఫీసుకు వెళ్లకుండా అడ్డం పెట్టిన బారికేడ్లపైకి ఎక్కారు రాహుల్ గాంధీ. జాతీయ జెండా ఊపుతో.. ఓటు దొంగ జ్ఞానేశ్.. గద్దె దిగు.. ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ పదవికి రాజీనామా చెయ్యి అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్, విపక్ష కూటమి ఎంపీలను అదుపులోకి తీసుకుని బస్సుల్లో వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు.
ప్రతిపక్షాల ఆందోళనలతో దేశ రాజధాని అట్టుడుకుతోంది. విపక్షాల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. పార్లమెంట్, ఈసీ కార్యాలయ పరిసరాలను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని.. పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపివేశారు.
