టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవర్ కొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కు పండగే. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న 'రణబాలి' పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే వీరిరివురి ఆన్ స్క్రీన్ కెమెస్ట్రీ ఎంత హిట్టో.. ఆఫ్ స్క్రీన్ బాండింగ్ , వీరి గురించిన రూమర్లు, ట్రోలింగ్ అంతకంటే హాట్ టాపిక్ గా మారాయి. లేటెస్ట్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ జంట చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తన హావభావాలు, మాట్లాడే తీరుపై ఇటీవల వస్తున్న దారుణమైన ట్రోల్స్ పై రష్మక గట్టిగా ఇచ్చిపడేసింది. నా ప్రవర్తన, మాటతీరు సహజం. అంతే కాని పబ్లిసిటీ కోసం నటించను. ప్రతి ఒక్కరికీ నేను నచ్చాలని లేదు. కొంతమంది నన్ను ఓవర్ యాక్టింగ్ చేస్తుందని అన్నా సరే.. నేను మాత్రం వారి పట్ల దయ , పాజిటివిటీ పంచడానికే మొగ్గుచూపుతా. అంతే కాని ఎవరినో సంతృప్తి పరచడానికి ఫేక్ గా బతకడం నా వల్ల కాదు అంటూ నెటిజన్ల నోళ్లు మూయించింది.
అంతే కాదు విజయ్ దేవరకొండ కూడా ట్రోలర్స్ పై గట్టిగానే విరుచుకుపడ్డాడు. వ్యక్తిగతంగా కనీసం ఒక్కసారైనా కలవని వారిపై అంతటి ద్వేషం , తీవ్రమైన అభిప్రాయాలు ఎలా ఏర్పడతాయి అని ప్రశ్నించారు. రాజకీయ నేతలు, సెలబ్రిటీలపై వచ్చే ట్రోలింగ్స్ లో చాలావరకు క్రియేట్ చేసినవే.. ఒక మనిషిని కనీసం కలవకుండానే.. అతనిని పూర్తిగా జడ్జ్ చేసి మాట్లాడం విడ్డూరం అని విజయ్ తేల్చి చెప్పారు.
►ALSO READ | EPIC OTT: లవ్, లివ్-ఇన్ రిలేషన్‌షిప్ కథగా ‘Epic’.. ఓటీటీలోకి ఆనంద్, వైష్ణవిల రొమాంటిక్ డ్రామా..
' గీతా గోవిందం' , ' డియర్ కామ్రేడ్ ' చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ హిట్ జోడీ.. ఇప్పుడు మరోసారి క్రేజీ ప్రాజెక్ట్ ' రణబలి' అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
