ఇండియన్ మిలటరీ అకాడమీలో (ఐఎంఏ)2027, జులైలో ప్రారంభం కానున్న 145వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (టీజీసీ145) ద్వారా ఇండియన్ ఆర్మీలో పర్మినెంట్ కమిషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 30.
విభాగాల వారీగా ఖాళీలు: సివిల్ 8, కంప్యూటర్ సైన్స్ 6, ఎలక్ట్రికల్ 2, ఎలక్ట్రానిక్స్ 6, మెకానికల్ 6, ఇతర ఇంజినీరింగ్ విభాగాలు 2.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో బీఈ/ బి.టెక్ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 2027, జులై 1 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. అంటే 2000, జులై 1 నుంచి 2007, జూన్ 30 మధ్యలో జన్మించిన వారై ఉండాలి.
లాస్ట్ డేట్: అక్టోబర్ 29.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.joinindianarmy.nic.inను సందర్శించండి.
►ALSO READ | నర్స్, ఏఎన్‌ఎం, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు: ఎగ్జామ్ లేకుండానే రిక్రూట్‌మెంట్.. వీరికి మంచి ఛాన్స్!
