టెక్ టెన్షన్స్: రూ. 42 లక్షల శాలరీ ప్యాకేజీ ఆఫర్ చేసిన ఒరాకిల్.. డైలమాలో టెక్కీ

టెక్ టెన్షన్స్: రూ. 42 లక్షల శాలరీ ప్యాకేజీ ఆఫర్ చేసిన ఒరాకిల్.. డైలమాలో టెక్కీ

టెక్ రంగంలో హై శాలరీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నప్పటికీ.. జాబ్ సేఫ్టీ అనేది లేకపోతే ఆ డబ్బుతో ఎలాంటి రిస్క్ ఉంటుందనే చర్చ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ టెక్ దిగ్గజం 'ఒరాకిల్' అందించిన రూ.42 లక్షల బేస్ శాలరీ ఆఫర్ సోషల్ మీడియాను విభజించేసింది. సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోస్ట్ కోసం వచ్చిన ఈ భారీ ఆఫర్ యువతను ఆకర్షిస్తున్నా.. లే ఆఫ్స్ భయం మాత్రం వారిని వెనక్కి తగ్గేలా చేస్తోంది.

ఈ చర్చ ప్రధాన కారణం రెడిట్ లో ఒక అభ్యర్థి పోస్ట్ చేసిన స్క్రీన్‌షాట్‌తో వెలుగులోకి వచ్చింది. "ఒరాకిల్ ఆఫర్‌కి - నేను వెళ్లవచ్చా?" అనే హెడ్డింగ్‌తో ఉన్న ఆ పోస్ట్‌లో.. ఒరాకిల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఉన్న లే ఆఫ్స్, ఆర్గనైజేషనల్ రీస్ట్రక్చరింగ్ వార్తలతో సదరు ఉద్యోగి జాబ్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు.

సదరు సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అభ్యర్థికి దాదాపు రూ. 41-42 లక్షల బేస్ శాలరీతో పాటు, 89వేల డాల్లర్ల విలువైన స్టాక్ ఆప్షన్లు, రీలొకేషన్ బెనిఫిట్స్ ఆఫర్ లో లభిస్తున్నాయి. కేవలం 3.5 సంవత్సరాల అనుభవం ఉన్న ఆ అభ్యర్థికి ఇది మంచి ప్యాకేజీగా అనిపించినా.. ఇటీవలి కాలంలో ఒరాకిల్‌లో జరుగుతున్న లే ఆఫ్స్ చూసి జాయిన్ అవ్వాలా వద్దా అంటూ టెప్టింగ్ ఆఫర్ పై ఆందోళన చెందుతున్నారు.

►ALSO READ | రిలయన్స్ Vs ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్: 'ఎనర్జీ డ్రింక్స్' లేబ్లింగ్ వివాదంలో ముఖేష్ అంబానీ!

ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొత్తగా జాయిన్ అయిన వారినే టార్గెట్ చేసి తొలగిస్తున్నారని రూమర్స్ ఉన్నాయి. మీ ప్రస్తుత జీతం కంటే 50 శాతానికి పైన ఒరాకిల ఉంటేనే ఈ రిస్క్ తీసుకోండి అని కొందరు హెచ్చరిస్తున్నారు. మరికొందరైతే స్టాక్స్ వెస్ట్ అయ్యేలోపు ఉద్యోగం నుంచి తీసేస్తారని.. మెంటల్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. డబ్బు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. ఉద్యోగ అభద్రత కారణంగా టెకీలు తీవ్ర మదన పడుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో.  దీంతో జీతం ఎక్కువని రిస్క్ చేయడం ఎంతవరకు సమంజసం అనే చర్చ ఐటీ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది.