ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ FSSAI తో వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఢీకొంటోంది. తమ క్యాంపా బ్రాండ్ ఉత్పత్తులను 'ఎనర్జీ డ్రింక్స్'గా మార్కెట్ చేయకుండా ఫుడ్ సేఫ్టడీ డిపార్ట్మెంట్ విధించిన ఆంక్షలను సవాలు చేస్తూ రిలయన్స్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఈ లేబ్లింగ్ క్రాక్‌డౌన్‌ను సవాలు చేస్తున్న లేటెస్ట్ బెవరేజ్ మేకర్‌గా రిలయన్స్ నిలిచింది.
అధిక కెఫేన్ ఉన్న పానీయాలను 'ఎనర్జీ డ్రింక్స్'గా పిలవకూడదంటూ జూన్ 30న FSSAI ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ రిలయన్స్ అక్టోబర్ 1న రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నిబంధనల కారణంగా అధికారులు తమ స్టాక్‌ను సీజ్ చేయడమే కాకుండా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఉత్పత్తులను తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారని పిటిషన్‌లో పేర్కొంది రిలయన్స్. దీనివల్ల తమ వ్యాపార కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇప్పటికే ఇదే వివాదంపై పెప్సికో, మాన్స్రా బెవరేజ్ వంటి కంపెనీలు కూడా FSSAI పై కోర్టును ఆశ్రయించాయి. తాము మార్కెట్లోకి తీసుకొచ్చిన లక్షలాది బాటిళ్లు, క్యాన్‌లపై ఈ కొత్త నిబంధనలు తీవ్ర ప్రభావం చూపుతాయని, ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఈ ఆదేశాలు జారీ చేశాయని ఆ సంస్థలు వాదించాయి. మరోవైపు రెడ్‌బుల్ ఉత్పత్తులకు మాత్రం తాత్కాలిక ఉపశమనం లభించింది.
►ALSO READ | ఓలా, ఉబెర్, ర్యాపిడోకు మహారాష్ట్ర సర్కార్ షాక్.. 100% ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలని డెడ్ లైన్
భారత మార్కెట్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఎనర్జీ డ్రింక్స్ సెగ్మెంట్‌లో ఏటా 12.6% వృద్ధి దూసుకుపోవాలని చూస్తున్న రిలయన్స్‌కు ఈ లేబ్లింగ్ ఆంక్షలు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. కోకాకోలా, పెప్సికో వంటి దిగ్గజాలకు పోటీగా రీఎంట్రీ ఇచ్చిన కంపెనీకి ఈ నిబంధనలు ఇబ్బందికరంగా మారాయి.
వినియోగదారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని హై-కెఫేన్ డ్రింక్స్‌పై నిబంధనలను కఠినతరం చేయాలని FSSAI భావిస్తోంది. అయితే ఉన్నపళంగా లేబుల్స్ మార్చడం వల్ల తమకు భారీ నష్టాలు కలుగుతాయని కంపెనీలు వాదిస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ బోర్డు, కూల్ డ్రింగ్స్ తయారీ కంపెనీల మధ్య నడుస్తున్న ఈ న్యాయ పోరాటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది దేశంలో.
