నేరడిగొండలో జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం

నేరడిగొండలో జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం

నేరడిగొండ, వెలుగు: అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో సీఎంటీసీ, జెండర్ రిసోర్స్ సెంటర్ ను శుక్రవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహిళలు, యువతకు అవసరమైన సేవలు, పరిశోధన, అవగాహన కార్యక్రమాలకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఇన్​చార్జి ఏపీఎం లింగరాజు, ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, వీడీసీ చైర్మన్ ఏలేటి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.