నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మిర్యాలగూడ టూ టౌన్ ఎస్సై సతీష్కు తీవ్ర గాయాలు

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మిర్యాలగూడ టూ టౌన్ ఎస్సై సతీష్కు తీవ్ర గాయాలు

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2026 అక్టోబర్ 14న  జరిగిన ప్రమాదంలో మిర్యాలగూడ టూ టౌన్ ఎస్సై సతీష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల దగ్గర బైక్ అదుపుతప్పి కిందపడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎస్సై సతీష్  తీవ్ర గాయాలపాలయ్యారు. 

గాయపడిన ఎస్సై సతీష్ ను  మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.