రేకుర్తి, విద్యానగర్ భూములను 22ఏ నుంచి తొలగించండి

రేకుర్తి, విద్యానగర్ భూములను 22ఏ నుంచి తొలగించండి
  •     మంత్రి పొంగులేటి శ్రీనివాస్​కు వెలిచాల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు విజ్ఞప్తి

కరీంనగర్, వెలుగు: కరీంనగర్​లోని రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి పరిధిలో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిని కోరారు. శుక్రవారం జగిత్యాలలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. 22ఏ నిషేధిత జాబితా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో రిజిస్ట్రేషన్లు జరిగిన భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో వాటి క్రయవిక్రయాలు నిలిచిపోయాయని తెలిపారు.

ఈ భూముల్లో ఎక్కువగా చిన్న, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఉన్నారని, చాలామంది ప్రభుత్వ అనుమతులతో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారని వివరించారు. మొత్తం 230 సర్వే నెంబర్లలో వెయ్యి ఎకరాలకు పైగా భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వివాదాలు, కోర్టు కేసులు లేని అర్హత కలిగిన పట్టా భూములను నిబంధనల ప్రకారం పరిశీలించి 22ఏ జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని కోరారు. స్పందించిన మంత్రి పొంగులేటి.. 22ఏ భూముల సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కరీంనగర్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించినట్లు రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు.