ఇల్లుకు సిమెంట్ ఇప్పిస్తానని అత్యాచారం.. యాదాద్రి జిల్లాలో ఆత్మకూరు(ఎం)లో ఘటన

ఇల్లుకు సిమెంట్ ఇప్పిస్తానని అత్యాచారం.. యాదాద్రి జిల్లాలో ఆత్మకూరు(ఎం)లో ఘటన

ఆత్మకూరు(ఎం)/యాదాద్రి , వెలుగు: ఇల్లుకు సిమెంట్ ఇప్పిస్తానని వివాహితపై అత్యాచారానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూరు(ఎం) మండలం పుల్లాయిగూడెం గ్రామానికి చెందిన వివాహితకు ఇందిరమ్మ ఇంటి పథకంలో ఇల్లు సాంక్షన్​అయింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పార్టీ లీడర్​శంకర్‌‌రెడ్డి ఇల్లుకు సిమెంట్​ఇప్పిస్తానని చెప్పి.. తన ఇంటికి పిలిపించుకున్నాడు.

 ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె కేసు పెడ్తానని చెప్పడంతో అరెకరం భూమి రాసిస్తానని, అన్ని విధాలుగా ఆదుకుంటానని నమ్మించాడు. ఇదే క్రమంలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వివాహిత భర్తకు విషయం తెలియడం, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. దీంతో సదరు మహిళ,ఆమె భర్తను శంకర్​ రెడ్డి బెదిరించాడు. ఈ క్రమంలో ఆమె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.